Curd For Weight Loss: పెరుగు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే భారతీయులు ఆహారాలు తీసుకున్న తర్వాత చివరిలో పెరుగు అన్నాన్ని తింటారు. వేసవిలో పెరుగు తినడం పొట్టకు అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కడుపులోని వేడిని తగ్గించడమే కాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపరుచుతుంది. పెరుగులో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్లుతో పాటు మినరల్స్ అధిక పరమాణాల్లో లభిస్తాయి. అయితే చాలా మంది తెలియని విషయం ఏమిటంటే..ప్రతి రోజు పెరుగును తీసుకోవడం వల్ల శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీర బరువును తగ్గించేకోవడానికి ప్రతి రోజు పెరుగును ఆహారాల్లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెరుగు వల్ల కలిగే లాభాలు:
బరువు తగ్గుతారు:
ఊబకాయం కారణంగా చాలా మంది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో ఫ్యాట్ లెస్ పెరుగును తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి రోజు ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఎముకలు కూడా దృఢంగా మారుతారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పెరుగును ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలోకి రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే మంచి బ్యాక్టీరియా అనేక రకాల తీవ్ర వ్యాధులతో పోరాడి..తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు, లాక్టోబాసిల్లస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది:
అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం తీసుకునే ఆహారాల్లో పెరుగును కలిపి తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో లభించే బ్యాక్టీరియా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
చర్మ సమస్యలకు చెక్:
ప్రస్తుతం చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా పెరుగుతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి