Coriander Water For Weight Loss Diabetes Control In 14 Days: కొత్తిమీర ఆకులు శరీరానికి చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఆహారాల రుచిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొత్తిమీర ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఇతర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీరలో ఉండే కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అనేక తీవ్ర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు. అయితే ఈ ఆకుల నుంచి రెట్టంపు ప్రయోజనాలు పొందాలనుకునేవారు.. కొత్తిమీర ఆకులను తీసుకుని మరిగించి తాగితే అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
కాలేయాన్ని సమస్యలు:
కొత్తిమీర ఆకులు కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్తి మీర ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకుంటే కాలేయం సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని కాలేయంలో పేరుకుపోయిన మలినాలను తొలగించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి పనిచేస్తుంది.
బరువు తగ్గిస్తుంది:
కొత్తిమీర ఆకుల నుంచి మరిగించి నీటిని క్రమం తప్పకుండా తాగితే.. సులభంగా బరువు నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీర బరువు తగ్గించే చాలా రకాల ఔషధ గుణాలున్నాయని కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా ఈ నీటిని తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ డ్రింక్‌ను కేవలం ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
చర్మ సమస్యలకు చెక్:
కొత్తిమీరతో మరిగించి నీటిని తీసుకుంటే రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ డ్రింక్స్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఉండే గుణాలు శరీరాన్ని డిటాక్సిఫై చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కొత్తిమీర ఆకుల నీటిని తాగడం వల్ల మొటిమలు సమస్యలు కూడా తొలగిపోతాయి.
మధుమేహం:
కొత్తిమీర ఆకుల్లో ఉండే గుణాలు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆకులను మరిగించి తీసుకుంటే చాలా రకాల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపునులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి