Weight Loss With Coconut Flour Paratha: ప్రస్తుతం చాలామంది ఆలు స్టఫింగ్ తో చేసిన పరాటాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఆలూకు బదులుగా పచ్చి కొబ్బరి పిండితో తయారుచేసిన స్టఫింగ్‌ని తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పరాటా పిండిలో కూడా కొబ్బరిని పిండిలా తయారుచేసి వినియోగించడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. కొబ్బరి పిండిలో ఉండే ఫైబర్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆలు పరాటా వల్ల శరీరానికి కలిగే లాభాలు ఇవే:
బరువు తగ్గొచ్చు:
కొబ్బరి పిండిలో అధిక మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆలు పరాటాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఆలు పరాటా తయారు చేసే క్రమంలో నూనెను ఎక్కువగా వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరాటాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభించి, శరీర బరువును నియంత్రిస్తుంది. దీంతోపాటు ఆకలి కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
కొబ్బరిలో ఉండే గుణాలు శరీరానికి తక్షణమైన శక్తిని అందించేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. కాబట్టి కొబ్బరి పిండితో తయారుచేసిన పరాటాలను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో అధిక మోతాదులో మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా మంచి కొలెస్ట్రాల్ గా మార్చేందుకు సహాయపడుతుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది:
గోధుమ పిండితో పోలిస్తే కొబ్బరి పిండిలో తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా కొబ్బరితో తయారు చేసిన పరాటాలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
కండరాల పెరుగుదల కోసం:
కొబ్బరి పిండిలో ప్రోటీన్స్ తగిన పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, కాపర్, మాంగనీస్ కూడా ఉంటాయి. కాబట్టి వీటితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కండరాలు కూడా దృఢంగా మారతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter