Burn Belly Fat In 12 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి నమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. బరువును నియంత్రించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవాడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. బరువును నియంత్రించుకునేందుకు ఆహారంపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రకాల జంక్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలను తినక పోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అలవాట్ల వల్ల తొందరగా బరువు తగ్గుతారు:
1. ఉదయం పూట టిఫిన్‌లో హెల్తీ ఫుడ్ తీసుకోండి:
ఉదయం పూట ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. కావున ఉదయం పూట మంచి పోషకాలున్న ఆహార పదార్థాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఉదయం పూట పూరీ, పరాటాలు వంటి ఆయిల్ ఫుడ్ తినే అలవాటు ఉన్నవాళ్లు వాటిని మానేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావాలంటే టిఫిక్ బదులుగా పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
2. రోజూ గ్రీన్ టీ తాగండి:
భారత్‌లో రోజూ ఉదయం ఏదో ఒక టీని తీసుకుంటూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాక పలు మార్లు ఛాయ్ తాగుతూ ఉండడం విశేషం. అయితే ఈ క్రమంలో చక్కెర అధికంగా ఉండే టీని తాగుతున్నారు. ఇలా తాగడం మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వీలైతే గ్రీన్ టీని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువును నియంత్రిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
3. ఫ్రూట్ షేక్స్ అస్సలు తాగొద్దు:
ఉదయం పూట చాలా మంది ఫ్రూట్ షేక్స్ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే చక్కెర పరిమణం శరీర బరువును పెంచుతుందని.. కావు దీనిని ఉదయం పూట తాగక పోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
4. తీపి వస్తువులకు దూరంగా ఉండండి:
స్వీట్స్, ఐస్ క్రీం కి దూరంగా ఉండడం చాలా మేలు. బరువు తగ్గాలనుకు వారు వీటిని మర్చిపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో చక్కెర పరిమాణం అధికంగా ఉండడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.