Magnesium Deficiency May Leads To Type 2 Diabetes: ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి డయాబెటిస్ లక్షణాలు ఉన్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మందిలో మెగ్నీషియం లోపం వల్ల కూడా మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది..
శరీరంలో మెగ్నీషియం లోపం కారణంగా:
చాలా మంది ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం మానుకుంటున్నారు. అయితే దీని వల్ల పోషకాల లోపంతో పాటు, మెగ్నీషియం లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో తరచుగా బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మెగ్నీషియం ఎందుకు ముఖ్యమైనది:
మెగ్నీషియం అనేది శరీరంలో ఒక ముఖ్యమైన ఖనిజం.. ఇది మన శరీరంలోని వివిధ రసాయన ప్రతిచర్యలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.
మెగ్నీషియం లోపం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందా?
గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెగ్నీషియం మన రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే దీని లోపం శరీరంలో ఏర్పడడం వల్ల మధుమేహం ప్రమాదాన్ని పెంచడమేకాకుండా.. గుండె జబ్బులు, బలహీనతతో పాటు అలసట, కండరాల ఒత్తిడి, వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
మెగ్నీషియం కోసం వీటిని తినండి:
>>డార్క్ చాక్లెట్
>>గింజలు
>>అరటిపండు
>>విత్తనాలు
>>ఆకుపచ్చ ఆకు కూరలు
>>సోయాబీన్
>>అవోకాడో
>>పెరుగు
>>కొవ్వు చేప
>>స్ట్రాబెర్రీ
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.