త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Suicide Case) దర్యాప్తును ముంబై పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 9 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ వాంగ్మూలం త్వరలోనే తీసుకోనున్నట్లు సమాచారం.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 17, 2020, 09:49 AM IST
త్వరలో విచారణకు సుశాంత్ గాళ్‌ఫ్రెండ్, నటి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య (Sushant Singh Rajput Suicide) కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ 9 మంది నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. వీరిలో సుశాంత్ స్నేహితులు మహేష్ శెట్టి, సిద్ధార్థ్ పితాని, సుశాంత్ క్రియేటివ్ కంటెంట్ మేనేజర్, హౌస్ కీపర్ దీపేష్ సావంత్, వంటమనిషి, తాళం తయారుచేసిన వ్యక్తి వాంగ్మూలాలు తొలుత సేకరించారు. మంగళవారం సుశాంత్ తండ్రి కేకే సింగ్, నటుడి ఇద్దరి సోదరీమణులు చెప్పిన విషయాలతో వాంగ్మూలం తీసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట మరో విషాదం

సుశాంత్ గాళ్ ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి వాంగ్మూలం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఏ క్షణంలోనైనా రియా వాంగ్మూలాన్ని తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. గత కొంతకాలం నుంచి వీరు రిలేషన్‌లో ఉన్నారని బాలీవుడ్‌లో ప్రచారంలో ఉంది. ముంబైలోనే ఉంటున్న సుశాంత్ మరో సోదరి నుంచి వాంగ్మూలాన్ని త్వరలో తీసుకోనున్నారు. గత కొంతకాలం నుంచి డిప్రెషన్‌తో బాధపడుతున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబై, బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ‘సుశాంత్ నుంచి ఇలాంటి ఫినిష్ ఊహించలేదు’

కాగా, ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు స్నేహితులు మహేష్ శెట్టి, రియా చక్రవర్తిలకు కాల్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. అయితే సోమవారం నాడు కూపర్ హాస్పిటల్‌కు వెళ్లి సుశాంత్‌కు రియా నివాళులు అర్పించింది. అదే రోజు పవన్ హాన్స్ శ్మశానవాటికలో సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు. కొందరు బాలీవుడ్ నటీనటులు, సుశాంత్ స్నేహితులు, కుటుంబసభ్యులు అంత్యక్రియల్లో పాల్గొని సుశాంత్‌కు తుది వీడ్కోలు పలికారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x