Rajinikanth as Governor: గవర్నర్ గా రజనీకాంత్.. ఇక సినిమాలకు బైబై!

Superstar Rajinikanth to become Governor in plan of BJP: రజనీకాంత్ త్వరలోనే గవర్నర్ గా నియమించుబడుతున్నారు అనే ప్రచారం మొదలైంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 09:09 AM IST
Rajinikanth as Governor: గవర్నర్ గా రజనీకాంత్.. ఇక సినిమాలకు బైబై!

Superstar Rajinikanth to become Governor in plan of BJP: నిజానికి ఉత్తరాదిలో చాలా వరకు రాష్ట్రాలను కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో దక్షిణాదిలో కూడా పాగా వేయాలని చూస్తోంది. కానీ కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ పార్టీ సత్తా చాట లేకపోతోంది. ఇప్పటికే తెలంగాణలో పూర్తిస్థాయి రాజకీయం మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలనే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే తమిళనాడులో సైతం బిజెపిని ఒక రేంజ్ లో యాక్టివ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మరీ పెద్దల సభకు పంపించింది. ఇప్పుడు బిజెపి మరో కీలక నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఇప్పటికే రజనీకాంత్ ను బిజెపిలో చేర్చుకుని తద్వారా ఆయన క్రేజ్ ను రాజకీయంగా వాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి భంగపడిన బిజెపి ఇప్పుడు మరో విధంగా ఆయన క్రేజ్ వాడుకునేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.

నిజానికి రజనీకాంత్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పంపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దానికి ముఖ్య కారణం ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో రజనీకాంత్ కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు హాజరై పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన మోడీ సహా బిజెపి పెద్దలను కలిసి మాట్లాడారు. తరువాత తమిళనాడు గవర్నర్ తో ఆయన భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది. తమిళనాడు గవర్నర్ తో రాజకీయాలే మాట్లాడాను కానీ ఏం మాట్లాడానో చెప్పలేనని రజినీకాంత్ పేర్కొనడం కూడా చర్చనీయాంశమైంది.

అయితే రాజకీయ పార్టీ పెట్టి తాను నడపలేనని తన వల్ల కాదని విరమించుకున్న రజినీకాంత్ ఇలా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం ఏమిటా అని అందరూ భావించారు. అసలు విషయం ఏమిటంటే 2024 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడు నుంచి మంచి నెంబర్ సీట్లు సాధించడమే ముఖ్య లక్ష్యంగా రంగంలోకి దిగిన బీజేపీ రజినీకాంత్ కి గవర్నర్ పదవి కట్ట పెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రధానమంత్రి మోడీ రజినీకాంత్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. గతంలో మోడీ చెన్నై వచ్చినప్పుడు కూడా రజనీకాంత్ ఇంటికి వెళ్లి చాలా సేపు ఆ కుటుంబంతో సమయం వెచ్చించి వెళ్లారు.

ఆ సాన్నిహిత్యం వల్ల మోదీ కోరడంతో రజనీకాంత్ కాదనలేక గవర్నర్ గిరి తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రజినీకాంత్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపితే తమిళనాడు ప్రజలందరూ రజనీకాంత్ బీజేపీ మనిషి అనుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన అభిమానుల ఓట్లను బిజెపి దక్కించుకోవడానికి ఇలా ప్లాన్ చేసిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి.

Also Read: Shyam Singha Roy In Oscar's: ఆస్కార్ నామినేషన్ రేసులో నాని శ్యామ్ సింగ రాయ్

Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News