ఈ సీతారాములది ప్రేమ వివాహం.. వెరీ ఇంట్రెస్టింగ్

భద్రాచలం లాంటి ప్రముఖ ఆలయాలలో కేవలం ఆలయ ప్రధాన అర్చకులు, ఇతరత్రా పూజారులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.

Last Updated : Apr 2, 2020, 06:54 PM IST
ఈ సీతారాములది ప్రేమ వివాహం.. వెరీ ఇంట్రెస్టింగ్

నేడు తెలుగు ప్రజలు పవిత్ర శ్రీరామనవమి పండుగను జరుపుకుటున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ఆలయాలకు వెళ్లకుండా ఇళ్లలోనే దేవుడికి నైవేద్యం సమర్పించుకున్నారు. భద్రాచలం లాంటి ప్రముఖ ఆలయాలలో కేవలం ఆలయ ప్రధాన అర్చకులు, ఇతరత్రా పూజారులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు.   సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ

ఈ రోజు ఇద్దరు నటీనటులకు కూడా ప్రత్యేకం. అలాగని నేడు వారి పెళ్లిరోజు కాదు. కానీ వారు కూడా సీతారాములు. సీరియల్‌లో సీత, రాముడు పాత్రలో కనిపించి మెప్పించిన ఆ నటీనటులు నిజ జీవితంలోనూ దంపతులయ్యారు. వారు మరెవరో కాదు బుల్లితెర నటుడు గుర్మీత్ చౌదరి, నటి డెబినా బొనర్జీ. 2008-09లో ఇమాజిన్ ఛానల్‌లో ప్రసారమైన రామాయణం సీరియల్‌లో గుర్మీత్ శ్రీరాముడిగా, డెబినా జానకి దేవి (సీత) పాత్రలు పోషించారు. వీరి పరిచయం ప్రేమగా మారింది, 2011లో వీరు పెళ్లి చేసుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు.  అమెజాన్ ప్రైమ్‌లో హిట్ మూవీ వచ్చేసింది

సీరియల్‌లో చేసిన సీతారాముల పాత్రలు ఒకరిపై మరొకరికి నమ్మకాన్ని పెంచాయి. పరస్పర గౌరవం ప్రేమగా మారింది. ఇంకే ముంది సీరియల్ సీతారాములు.. నిజ జీవితంలోనూ వివాహం చేసుకుని ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. గుర్మీత్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. మంచి డ్యాన్సరే కాదు అందగాడు కూడా. ఆసియాలో టాప్ 10 సెక్సియస్ట్ పర్సన్‌స్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు.

కాగా, నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని గుర్మీత్ శుభాకాంక్షలు తెలిపాడు. నేడు శ్రీరాముడి పుట్టినరోజు. అదే విధంగా రాముడి పాత్రతో నటుడిగా నాకు జన్మ లభించింది. సీతపాత్ర పోషించిన డెబినానే వివాహం చేసుకున్నాను. జై శ్రీరామ్’ #RamNavami2020 #Ramayan అని ట్యాగ్స్‌తో సీతారాములుగా తమ ఫొటోలను గుర్మీత్ తన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

Trending News