ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోన్స్ ను పెళ్ళాడేందుకు సిద్ధమౌతుంది. ఈ విషయం తన కుటుంబ సభ్యులు కానీ అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకపోయినా తాజా పరిణామాలు ఇదే సూచిస్తోంది. రీసెంట్ గా నిక్ జోన్స్ తో గోవా వెకేషన్ కి వెళ్ళిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరోవైపు నిక్ జోన్స్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ప్రియాంక చోప్రా వీడియో పోస్ట్ చేశాడు. దీంతో వీళ్లద్దరి రిలేషన్ షిప్ లో ఉన్నారని ఫ్యాన్స్ కన్ఫం చేసుకున్నారు.
ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ జోడి తమ రిలేషన్ గురించి బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే పెళ్లికి సిద్ధమౌతున్నారనే టాక్ వినిపిప్తోంది. వచ్చే నెలలో నిక్ జోన్స్ తో ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్ జరుగుతుందని..ఆగష్టు కల్లా పెళ్ళి చేసుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రియాంక పబ్లిక్ గా అనౌన్స్ చేసి పెళ్ళి చేసుకుంటుందా..? లేకపోతే సీక్రెట్ గా పెళ్ళి కానిచ్చి తరవాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.