Nawab Malik On Sameer Wankhede: 'డబ్బు కోసం బాలీవుడ్​ యాక్టర్ల ఫోన్లు ట్యాప్​ చేస్తున్నారు'

Nawab Malik On Sameer Wankhede: బాలీవుడ్​ నటీనటుల ఫోన్లను ఎన్​సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్ వాంఖడే అక్రమంగా ట్యాప్​ చేస్తున్నారని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ (Nawab Malik News)​ ఆరోపించారు. సెలిబ్రిటీల ఫోన్లను ట్యాప్​ (Phone Tapping News) చేసి వారి నుంచి డబ్బును డిమాండ్​ చేస్తున్నట్లు తనకు ఓ లేఖ ద్వారా తనకు తెలిసినట్లు వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 12:45 PM IST
    • బాలీవుడ్​ డ్రగ్స్​ కేసుపై మహరాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్ సంచలన వ్యాఖ్యలు ​
    • సినీ నటుల ఫోన్లను ఎన్​సీబీ అధికారి సమీర్​ ట్యాప్​ చేస్తున్నారని ఆరోపణ
    • డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని వ్యాఖ్య
Nawab Malik On Sameer Wankhede: 'డబ్బు కోసం బాలీవుడ్​ యాక్టర్ల ఫోన్లు ట్యాప్​ చేస్తున్నారు'

Nawab Malik On Sameer Wankhede: ముంబయి క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు (Mumbai Cruise Drug Case) వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే (NCB Zonal Director Sameer Wankhede) తరపున డబ్బు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్ర క్యాబినేట్​ మంత్రి నవాబ్‌ మాలిక్‌ (Nawab Malik News).. ఓ సంచలన లేఖను బయటపెట్టారు. సమీర్‌ వాంఖడే బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ (Phone Tapping News) చేసి, వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవారని మాలిక్‌ తాజాగా ఆరోపించారు. 

మంగళవారం ఉదయం నవాబ్‌ మాలిక్‌ ఇంటికి గుర్తుతెలియని ఎన్‌సీబీ సిబ్బంది పేరుతో ఓ లేఖ వచ్చింది. ఆ లేఖను మంత్రి తన ట్విటర్‌ (Nawab Malik Twitter) ఖాతాలో పోస్ట్‌ చేశారు. సమీర్‌ వాంఖడే  బాలీవుడ్‌ నటుల ఫోన్లను అక్రమంగా ట్యాప్‌ చేయించారని ఆ లేఖలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లేఖను తాను సీఎం, డీజీ కార్యాలయాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. వాంఖడేపై నమోదైన కేసు విచారణలో భాగంగా ఈ లేఖపై దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.  

"ముంబయి, ఠాణెల్లోని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో వాంఖడే.. ప్రముఖ వ్యక్తులు, బాలీవుడ్‌ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు సమాచారం అందింది. ఆయన మా ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారు. నా కుమార్తె నిలోఫర్‌ కాల్‌ డేటా రికార్డ్‌ కావాలని ముంబయి పోలీసులను అడిగారట. అయితే, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. 26 కేసుల దర్యాప్తు సమయంలో వాంఖడే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కొందరిపై తప్పుడు కేసులు బనాయించారని లేఖలో ఉంది" అని మాలిక్‌ వెల్లడించారు. 

మాలిక్​ వ్యాఖ్యలను ఖండించిన వాంఖడే

నవాబ్‌ మాలిక్‌ షేర్‌ చేసిన లేఖను ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే (Sameer Wankhede News) ఖండించారు. ఆ లేఖ పెద్ద జోక్‌, అబద్ధమని కొట్టిపారేశారు. అందులో ఉన్నదంతా తప్పుడు సమాచారమని అన్నారు. మాలిక్ తనపై ఎన్ని ఆరోపణలైనా చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ ఆయనకు ఉందని అన్నారు. అయితే.. ఈ లేఖను దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌ అశోక్‌ జైన్‌ చెప్పారు. 

ఆర్యన్​ ఖాన్​ను వదిలేయడానికి రూ.25 కోట్లు!

క్రూయిజ్‌ నౌక కేసులో (Mumbai Cruise Drug Case) అరెస్టయిన షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను (Aryan Khan Arrest) విడుదల చేయడానికి రూ.25కోట్లు డిమాండ్‌ చేశారంటూ ప్రభాకర్‌ సాయీల్‌ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆర్యన్‌ను విడుదల చేయడానికి రూ.25 కోట్లు ఇవ్వాలని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందంటూ ఓ ప్రైవేటు వ్యక్తి మరికొందరితో కలసి షారుక్‌ను డిమాండ్‌ చేసినట్లు ప్రభాకర్‌ ఆదివారం వెల్లడించడం సంచలనం రేపింది. దీంతో ఈ వ్యవహారంలో వాంఖడే సహా మరింకొందరిపై దిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది. 

Also Read: Aryan Khan Case: ఈ రోజే నాలుగో సారి ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ.. బెయిల్ వస్తుందా..? రాదా?

Also Read: Aryan Khan Drugs Case: బాలీవుడ్‌లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News