Nani Bollywood debut: బాలీవుడ్ ఎంట్రీపై నాని రియాక్షన్

నాచురల్ స్టార్ నాని ( Nani ) ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకొని తాజాగా 25వ సినిమా అయిన V చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబరు 5న OTT ప్లాట్‌ఫాంపై ఈ సినిమా విడుదల కాబోతుంది. అందుకోసం V సినిమా టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

Last Updated : Sep 3, 2020, 11:26 PM IST
Nani Bollywood debut: బాలీవుడ్ ఎంట్రీపై నాని రియాక్షన్

నాచురల్ స్టార్ నాని ( Nani ) ఇప్పటి వరకు 24 సినిమాలు పూర్తి చేసుకొని తాజాగా 25వ సినిమా అయిన V చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబరు 5న OTT ప్లాట్‌ఫాంపై ఈ సినిమా విడుదల కాబోతుంది. అందుకోసం V సినిమా టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ప్రస్తుత చిత్రాల కంటే తన కెరీర్‌లో రాబోయే సినిమాలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయని వెల్లడించాడు. నాని తదుపరి చేయబోయే ఐదు చిత్రాలలో ఐదు వేర్వేరు జానర్స్‌లో ఉంటాయని.. అలాగే ఈ సినిమాల్లో నాని కొత్తగా కనిపించబోతున్నాడని పేర్కొన్నాడు. నాని తన బాలీవుడ్ ఎంట్రీపై కూడా ఈ ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చాడు. “ప్రస్తుతం తన కెరీర్ టాలివుడ్ ఇండస్ట్రీలో చాలా సంతోషంగా సాగుతుందని, ఇంకా కూడా తెలుగులో మంచి సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఒకవేళ మంచి స్క్రిప్ట్ వస్తే అప్పుడు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తా అని వ్యాఖ్యానించాడు. Also read : Pooja Hegde: సిటీలో ఖరీదైన ఇంటికి ప్లాన్ చేస్తున్న కన్నడ బ్యూటీ

V movie మార్చి 25న తెలుగు నూతన సంవత్సర కానుకగా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా ( Coronavirus ) మహమ్మారి కారణంగా అప్పటి నుంచి అది వాయిదా పడుతూ వచ్చింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం ( Mohanakrishna Indraganti ) వహించిన ఈ చిత్రంలో సుదీర్ బాబు, నివేదా థామస్ ( Actress Nivetha Thomas ), అదితి రావు హైదరి, వెన్నెల కిషోర్, జగపతి బాబు, నాజర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Also read : SLPL schedule: 5 క్రికెట్ జట్లు.. 15 రోజుల టీ20 టోర్నమెంట్

Trending News