ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నారు ?

ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నారు ?

Last Updated : Jan 10, 2019, 12:28 PM IST
ఏఎన్నార్ బయోపిక్‌పై నాగ్ ఏమన్నారు ?

తెలుగు సినీ పరిశ్రమ తొలి తరం లెజెండ్స్‌లో ఏఎన్నార్ ఒకరు. తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కలర్‌ఫుల్ మనం సినిమాల వరకు ఆయన కొనసాగించిన సినీ ప్రస్థానం అనిర్వచనీయమైనది. ఇటీవల కాలంలో వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా పలు బయోపిక్స్ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు ఆడియెన్స్ ముందుకొస్తుందా అని అక్కినేని అభిమానులను ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. ఇదే విషయమై అనేక సందర్భాల్లో మీడియా మిత్రులు సైతం నాగ్‌ వద్ద ప్రస్తావించగా.. నాగ్ ఎప్పుడూ నవ్వుతూనే ఆ ప్రశ్నను దాటవేస్తూ వస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ చాముండేశ్వరీనాథ్‌తో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నాగ్‌ని ఇదే విషయంపై స్పందించాల్సిందిగా మీడియా మరోసారి కోరింది. 

ఎన్.టి.ఆర్ బయోపిక్‌లోని మొదటి భాగమైన కథా నాయకుడు విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ప్రస్తుత నేపథ్యంలో ఏఎన్నార్ బయోపిక్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మరోసారి నాగ్ నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చింది. ఏఎన్నార్ బయోపిక్ గురించి ఏమీ సమాధానం చెప్పకుండానే నాగ్ అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. దీంతో ఏఎన్నార్ బయోపిక్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌కి ఇకనైనా తెరపడుతుందేమోనని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. 

Trending News