Karthikeya 2 Collection: సత్తా చాటిన కార్తికేయ 2.. మూడో రోజు సంచలనం.. బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేసి కోట్లలో లాభాలు!

karthikeya 2 Finishes Breakeven Target in 3 Days: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన కార్తికేయ 2 సినిమా మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా మూడో రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 16, 2022, 12:46 PM IST
Karthikeya 2 Collection: సత్తా చాటిన కార్తికేయ 2.. మూడో రోజు సంచలనం.. బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేసి కోట్లలో లాభాలు!

Karthikeya 2 Finishes Breakeven Target in 3 Days: 2014 సంవత్సరంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 రూపొందిన సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టాకేలకి అనేక వాయిదాల అనంతరం 13వ తేదీ ఆగస్టు నెలలో విడుదలైంది. ఇక ఈ సినిమా మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.

ఈ నెలలో విడుదలైన బింబిసార సినిమా కూడా ఇదే విధంగా మూడో రోజు బ్రేక్ ఈవెన్ సాధించగా ఇప్పుడు కార్తికేయ 2 సినిమా కూడా మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. కార్తికేయ 2 మూడు రోజుల వసూళ్లు విషయానికి వస్తే మొదటి రోజు మూడు కోట్ల యాభై లక్షలు,  రెండో రోజు మూడు కోట్ల 81 లక్షలు,  మూడో రోజు నాలుగు కోట్ల 23 లక్షల వసూళ్లు సాధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో మూడు రోజులకు 11 కోట్ల 54 లక్షల వసూళ్లు సాధించింది.

ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో 11 కోట్ల 54 లక్షల వసూళ్లు సాధిస్తే కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 70 లక్షలు,  ఓవర్సీస్ ప్రాంతాల్లో రెండు కోట్ల 60 లక్షలు,  నార్త్ ఇండియాలో 60 లక్షల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ చూసుకుంటే గనక 12 కోట్ల 80 లక్షలు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్ల 30 లక్షలుగా నిర్ణయించారు.

అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసిన ఈ సినిమా రెండు కోట్ల 14 లక్షల ప్రాఫిట్ తో లాభాల బాట పట్టింది. ఈ సినిమాకు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సెలవు కూడా కలిసి రావడంతో మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.  ఇక కార్తికేయ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్,  వివేక్ కూచిభొట్ల,  అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

Also Read: Tollywood Movies Collections: టాలీవుడ్ కు కలిసొచ్చిన ఇండిపెండెన్స్ డే.. భారీగా వసూళ్లు!

Also Read: Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News