బాలీవుడ్‌లో బలపడుతున్న ప్రభాస్ !!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ మీదుగా పనియనించి బాలీవుడ్ లో బలపడుతున్న ప్రభాస్

Last Updated : Jul 8, 2019, 03:58 PM IST
బాలీవుడ్‌లో బలపడుతున్న ప్రభాస్ !!

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ మీదుగా పనియనించి బాలీవుడ్ లో బలపడతున్న ప్రభాస్..ఇదేదో వాతావరణానికి సంబంధించిన వాయుగుండం వార్త అనుకునేరు.. అలాంటిదే కానీ.. ఇది ప్రభాస్ గుండం. టాలీవుడ్ లో అల్లరి రాముడు, పౌర్ణమి, ఛత్రపతి, డార్లింగ్ లాంటి మూవీస్ తో రెబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్... మిర్చి, రెబల్ లాంటి సక్సెస్ మూవీస్ తో సౌత్ లోనూ స్టార్ స్టేటర్ తెచ్చుకున్నాడు. ఇంతటితో ఆగకుండా బాహుబలీ మూవీతో సౌత్ తో పాటు నార్త్ ఈస్ట్ వెస్ట్ లోనూ స్టార్ స్టేషస్ సంపాదించాడు. ఒక్క బాహుబలితో దేశ వ్యాప్తంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వీరాభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్.

సాహో ఓ సువార్ణవకాశం

బాహుబలి మూవీ అంశాన్ని ప్రస్తావిస్తూ మంచి కథం దొరకడం వల్లే ప్రభాస్ కు బాలీవుడ్ లో ఈ మాత్రం క్రేజ్ దక్కిందని..అందులో ప్రభాస్ గొప్పదనం ఏమీ లేదని బాలీవుడ్ సినీ విమర్శకులు సెటైర్లు వేశారు. దీంతో విమర్శకుల నోళ్లకు చెక్ పెట్టేందుకుగాను ప్రభాస్ కు బాలీవుడ్ లో తనేంటో నిరూపించుకునే పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో సాహో రూపంలో మంచి అవకాశం దొరికింది.

బాలీవుడ్ లో సాహో టాక్

కేవలం కథతోనే కాదు.. ఫేస్ లుక్..నటనతో బాలీవుడ్ ను సైతం ఊపేయగలననే నమ్మకంతో ఉన్న ప్రభాస్ కు సాహో రూపంలో బాలీవుడ్ ను షేక్ చేసే ఛాన్స్ దొరికింది.. ఈ మూవీ సౌత్ తో పాటు బాలీవుడ్ కూడా వందల కొద్ది ధియోటర్స్ రిలీజ్ చేసేందకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. సాహో మూవీ తెరపైకి ఎక్కక ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడనే టాక్ వినడంతో బాలీవుడ్ అభిమానుల్లో సాహో పట్ల మంచి క్రేజ్ ఏర్పడింది.

ఆ స్థాయిలో ఎదిగినా ?

సాహో’ మేకర్స్ చేస్తున్న ప్రతి చిన్న ప్రమోషన్ కి బాలీవుడ్ ఆడియెన్స్ నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోందట. దీన్ని బట్టి చూస్తే రోజు రోజుకి బాలీవుడ్ లో ప్రభాస్ ప్లేజ్ ఏంటో చెప్పడానికి ..ఇది చిన్న షాక్ ట్రీడ్ మెంట్ మాత్రమే. మూవీ రిలీజ్ చేసి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఢీకొడతానంటున్నాడు ప్రభాస్.. మరి ప్రభాస్ బాలీవుడ్ లోనూ తను ఆశించిన స్థాయిలో ఎదగాలని కోరుకుందాం .

Trending News