ఈపీఎఫ్ఓ కార్యాలయం ఉద్యోగులకు శుభవార్త విన్పించింది. ఉద్యోగస్థులైతే మీ ఎక్కౌంట్లో చాలాకాలంగా ఎదురుచూస్తున్న డబ్బులు క్రెడిట్ అవడం ప్రారంభమైంది. మరి మీ ఎక్కౌంట్లో కూడా ఆ డబ్బులు జమ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి.
పీఎఫ్ ఎక్కౌంట్‌లోని డబ్బుపై కేంద్ర ప్రభుత్వం ఏడాదికోసారి లెక్కించి వడ్డీ ఒకేసారి జమ చేస్తుంటుంది. 2022 ఆర్ధిక సంవత్సరం పీఎఫ్ వడ్డీ డబ్బుల్ని కేంద్రం విడుదల చేసింది. పీఎఫ్ ఎక్కౌంట్లతో డబ్బులు జమ అవడం ప్రారంభమైంది. మీరు కూడా మీ ఎక్కౌంట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా వడ్డీ డబ్బులు మీ ఎక్కౌంట్‌లో చేరకపోతే..త్వరలోనే చేరిపోతాయి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతోందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. వడ్డీ డబ్బులు ఇంకా రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
8.1 శాతం చొప్పున లభిస్తున్న పీఎఫ్ వడ్డీ
కేంద్ర ప్రభుత్వం ఈసారి పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీ ఇస్తోంది. గత 40 ఏళ్లలో ఇదే అత్యల్పమైన వడ్డీ రేటు. ఇంతకుముందు అంటే 1977-78లో 8 శాతం చొప్పున వడ్డీ చెల్లించారు.
వడ్డీ డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలి
మిస్డ్‌కాల్ ద్వారా బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి
మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చి మీ వడ్డీ నగదు పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్ నెంబర్ ద్వారా 011-22901406 మిస్డ్‌కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆధికారిక వెబ్‌సైట్‌తో ఇలా చెక్ చేయవచ్చు
మీరు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసిన తురవాత ఈ పాస్‌బుక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యూఏఎన్ నెంబర్ పాస్‌వర్డ్ , క్యాప్చా ఎంటర్ చేస్తే...అన్ని వివరాలు కన్పిస్తాయి.
యాప్ నుంచి ఎలా చెక్ చేయడం
ఉమంగ్ యాప్ ద్వారా కూడా మీరు పీఎఫ్ వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేయవచ్చు. ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వివరాలు నమోదు చేసిన తరువాత వ్యూ పాస్‌బుక్ ఎంటర్ చేయాలి. మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఓటీపీ నమోదు చేయాలి. ఇలా మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
మెస్సేజ్ ద్వారా
7738299899 మెస్సేజ్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. మెస్సేజ్‌లో EPFOHO టైప్ చేసి పంపించాలి. టెక్స్ట్ మెస్సేజ్ ద్వారా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది.
Also read: mAadhaar App: ఆధార్‌కార్డు ఉంటే..వెంటనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేస్తే చాలు..అన్ని పనులు దీనితోనే ఇక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook