దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ
లేఖ రాయకుండా ఎన్ని రోజులైంది..! క్రమ క్రమంగా మనం లేఖలకు దూరమయ్యాము.. అవునా ! ఇప్పుడు అందరం ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్‌లు లాంటి సామాజిక మాధ్యమాలను ఆకర్షితులయ్యాము కదూ. 'రాయడం' అన్న సందర్భం వచ్చింది కాబట్టి.. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటో గానీ ఉత్తరం అంటే ఓస్ ఉత్తరామేగా అని లైట్ తీసుకుంటాం. కానీ ఉత్తరానికి ఓ ప్రత్యేకత ఉంది. రాసిన తేదీ, ప్రదేశం, చిరునామా.. ఇలా ఎన్నో లేఖలో దాగి ఉంటాయి. వాస్తవానికి అవన్నీ మనల్ని ఆలోచింపజేస్తాయి. లేఖలో ఒక పదం రాయడానికి ముందు ఎంతలా అలోచిస్తామో.. అది లేఖ రాసే వారికే తెలుసు. మనమిప్పుడు వాటి నుండి దూరంగా వచ్చేశాం.
ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు తక్కువైపోయాయి.. అవి కనుమరుగైనట్లుగా అనిపిస్తోంది. చివరిసారిగా మీరు లేఖను ఎవరికి రాశారు? ఏమని రాశారు? సంబంధాలను గుర్తుకు తెచ్చే ఏదైనా లేఖ గానీ, గ్రీటింగ్ కార్డు గానీ మీ వద్ద ఉందా ! సంబంధాలు, ఆప్యాయతల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ లేఖలు మన రిలేషన్స్ కు వారధులుగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.
మోడ్రనైజేషన్ మోజులో పడి సంభాషణ వారధులుగా ఉన్న లేఖలు రాసే ప్రక్రియను మనం మరిచిపోయాం.. మన చేతులారా ఆ విధానాన్ని మట్టిలో కలిపేశాం. సరే కొత్త వారధులను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామా అంటే..అదీ జరగడం లేదు. సంభాషణలతో ప్రేమను నిర్మించ వచ్చనే నమ్మకం సడలింది. ఫలితంగా ప్రేమతో మాట్లాడుకోవడం తగ్గిపోయింది. అసలు లేఖ ద్వారా సంభాషించుకోవడం అంటేనే అదే పెద్ద నేరంగా పరిగణించే పరిస్థితి నెలకొంది.
మొబైల్ 'టాక్ టైం' వలే ఉచితమైతే బాగుండూ... కానీ రాసిన సంభాషణల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేం. ఫోన్లో మాట్లాడటానికి, స్వహస్తాలతో రాయడానికి ఎంతో తేడా ఉంది. ఈ తేడాను మనం మర్చిపోయి... ఎదో ఉన్నాం అన్నట్లు కాలాన్ని గడిపేస్తున్నాం. ఫలితంగా మన మధ్య ప్రేమానురాగాలు, బంధాలు సన్నగిల్లాయి.
ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి. ఒక ప్రయోగం చేయండి..
మీరు మీ పాత స్నేహితుడితో గల సంబంధాల గురించి ఓ పది మాటలు మాట్లాడండి. మీరు కొద్దిసేపు ఆగుతారు. ఆలోచిస్తారు. మాట్లాడుతారు. మళ్లీ ఆలోచిస్తారు.. మళ్లీ మాట్లాడుతారు. ఇదంతా జరిగాక మీకు పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకువస్తాయి. లేఖలు, ఈ-మెయిల్, కార్డులు రాక ముందు ఇలానే జరిగేది. కానీ ఇప్పుడు మనం ఈ మొత్తం భారాన్ని ఎస్ఎంఎస్‌లపై ఉంచాము.
ఒకరికొకరు కలుసుకోవడం తక్కువైపోయాయి. కలిసి జీవిస్తున్నా.. కలిసి ప్రయాణం చేస్తున్నా తక్కువగా మాట్లాడుకుంటున్నాము. దీంతో జీవితంలో ఆనందాలకు, సుఖదుఃఖాలకు, ఉత్సాహంగా గడపాల్సిన జీవనానికి దూరమవుతున్నాం.
వాస్తవానికి ప్రతి ఒక్కరికీ కలలుకనే స్వేఛ్చ ఉంది. ఉండాలి కూడా. కానీ ప్రతిదీ పరిధిలో ఉండాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి. ఉదాహరణకి రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు రోడ్డు ఎంత ఖాళీగా, శుభ్రంగా ఉన్నప్పటికీ మీరు పరిధి దాటరాదు. ఒకవేళ దాటితే ప్రమాదానికి గురైతారు. అందుకే పరిధిలో ఉండాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి .
ఇది జీవితానికి వర్తిస్తుంది.... ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. కలలు సాకారం చేసుకోవడం కోసం కాస్త శ్రమించడంలో తప్పు లేదు.. శ్రమ ఉన్పప్పుడు దాని విలువ మనకు తెలిసి వస్తుంది. కానీ కుటుంబం, మిత్రులు, బంధువులతో సంబంధాల పెంపొందిచుకునే క్రమంలో మనం ఏం చేస్తున్నాం..ఎంత సమయం కేటాయిస్తున్నాం.. ప్రశ్నించుకుంటే ..అది ప్రశ్నగానే మిగిలిపోతుంది కదూ..
కాబట్టి మీరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితుల కోసం కాస్త సమయం కేటాయించుకోండి. వారితో రిలేషన్స్ పెంపొందించుకునేందుకు శ్రమించి లేఖ రాయడం ప్రారంభించండి. ఈ మాటలు మీకు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ ఇవే మన జీవితంలో సంతోషాన్ని నింపుతాయనే విషయాన్ని గుర్తించుకోండి.
ఒత్తిడి, నిరాశలలో చిక్కుకోకుండా ఉండటానికి లేఖ రాయడమే సరైన వైద్యం. ఉత్తరం, సంభాషణలు అనేవి ఇరువురి మధ్య సంబంధాలను మరింతగా పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయనే విషయాన్ని బలంగా నమ్మండి. నమ్మకం కలగకపోతే ఆచరించి చూడండి మీరే అర్థమౌతుంది...
''తలచుకుంటే మదిలో ప్రేమ భవనం నిర్మించగలం. కానీ మనం గూడు కట్టే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం''.
తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు:
https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi
ఈ ఆర్టికల్ ను హిందీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://zeenews.india.com/hindi/special/dear-zindagi-dayashankar-mishra-o...
ఈ ఆర్టికల్ ను మరాఠీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://zeenews.india.com/marathi/blogs/dear-zindagi-dayashankar-mishra-m...
ఈ ఆర్టికల్ ను గుజరాతీలో చదివేందుకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
http://zeenews.india.com/gujarati/dear-zindagi/dear-zindagi-dayashankar-...