Beetroot For Weight Loss: బీట్‌రూట్ రసంతో బరువు తగ్గడమేకాకుండా.. ఈ వ్యాధులకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు..

Beetroot For Weight Loss: బీట్‌రూట్ రసంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Last Updated : Dec 3, 2022, 04:16 PM IST
Beetroot For Weight Loss: బీట్‌రూట్ రసంతో బరువు తగ్గడమేకాకుండా.. ఈ వ్యాధులకు శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు..

Beetroot For Weight Loss: బీట్‌రూట్ భూమి లోపల పండించే దుంపలు. వీటిని ఎక్కువగా సలాడ్స్‌లో వినియోగిస్తారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. బీట్‌రూట్‌లో డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి పోషకాలుంటాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బీట్‌రూట్‌ను జ్యూస్‌లా చేసుకుని కూడా తాగొచ్చు. ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. యూరిన్ ఇన్ఫెక్షన్లు:

భారతదేశంలో చాలా మంది ప్రజలు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఓపెన్ యూరిన్, మూత్రంలో మంటలు మొదలైన సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఉదయం బీట్‌రూట్ జ్యూస్‌ని ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

2. బరువు తగ్గడం:
ఆధునిక జీవన శైలి కారణంగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రతి రోజూ డైటరీ ఫైబర్ ఉన్న ఫుడ్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం బీట్‌రూట్ జ్యూస్‌ తాగాల్సి ఉంటుంది.

3. పోషకాల శోషణ:
బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ బీట్‌రూట్ జ్యూస్‌ని జ్యూస్‌ను ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తాగితే పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.

Also Read : Suresh Babu-Samantha : సమంత మహానటి.. నాగ చైతన్య పెద్ద మామ సురేష్ బాబు కామెంట్స్

Also Read : Sai Dharam Tej Sweet Reply : ఎంతైనా మెగా హీరో కదా?.. ఒదిగి ఉండటం బ్లెడ్డులోనే ఉంటుందేమో.. నెటిజన్‌కు స్వీట్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News