Karthikeya love Story: ప్రేయసిలో పెళ్లికి ముందు లవ్​ స్టోరీ రివీల్ చేసిన హీరో కార్తికేయ

Karthikeya love Story: టావీవుడ్ యువ హీరో కార్తికేయ తన లవ్​ స్టోరీ బయట పెట్టారు. త్వరలోనే తన ప్రేయసిని వివాహం చేసుకోనున్ననట్లు తెప్పారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 11:52 AM IST
  • త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న ఆర్​ఎక్స్ 100 హీరో
  • పెళ్లికు ముందు లవ్​ స్టోరీ బయట పెట్టిన కార్తికేయ
  • ఈ ఏడాదిలో ఆగస్టులోనే ఎంగేజ్​మెంట్ చేసుకున్న యువ హీరో
Karthikeya love Story: ప్రేయసిలో పెళ్లికి ముందు లవ్​ స్టోరీ రివీల్ చేసిన హీరో కార్తికేయ

Karthikeya revealed his love story: ఇటు హీరోగా.. మరోపక్క విలన్​గా మెప్పస్తూ.. టాలీవుడ్​లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటుడు కార్తికేయ ఓ సర్​ప్రైజ్ (Hero Karthikeya) ఇచ్చాడు. త్వరలోనే బ్యాచిలర్​ లైఫ్​కు గుడ్​బై చెప్పి.. వివాహ బంధంలోకి (Karthikeya marriage) అడుగుపెట్టనున్నట్లు తెలిపారు కార్తికేయ.

ఈ నేపథ్యంలో.. ఇటీవలే తన లవ్​ స్టోరీ, తనకు కాబోయే భార్య ఎలా పరిచయం అనే వివరాలను పంచుకున్నారు. కార్తికేయ నటించిన తాజా చిత్రం 'రాజా విక్రమార్క' (Raja vikramarka movie) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఈ విషయాలను పంచుకున్నారాయన.

ఈ నెలలోనే పెళ్లి..

తన లైఫ్​లో హీరో అవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో.. తనకు ఇష్టమైన అమ్మయి (Karhikeya Girl friend) ప్రేమను పొందేందుకు అంతే ప్రయత్నం చేశానని చెప్పారు కార్తికేయ. తన పేరు లోహిత (Kathikey Girl firend name) అని.. తెలిపారు. నిజానికి కార్తికేయ ఈ విషయాలు ఇంతకు ముందు కూడా చెప్పరు.

ఈ ఏడాది ఆగస్టులో వీరికి ఎంగేజ్​మెంట్ అవగా.. అప్పుడు పేరు.. ఎక్కడ, ఎలా పరిచయం అనే వివరాలు వెల్లడించారు. వరంగల్​ నిట్​లో చదువుతున్నప్పుడు 2010లో తను పరిచయమైందని చెప్పారు కార్తికేయ. ఆ పరిచయం స్నేహంగా మారి ప్రేమ చిగురించిందని (Karthikeya love story) చెప్పుకొచ్చారు. ముందు తానే ప్రపోజ్ చేశానని.. దాదాపు ఏడాది తర్వాత తను ఒప్పుకుందన్నారాయన.

Also read: Malaika Arora Gallery: బాలీవుడ్ హాట్ క్వీన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్

తనను ఒప్పించేందుకు గిఫ్టులు ఇచ్చి.. మెసేజ్​ కోసం ఎదురు చూసే వాణ్ణని ప్రేమ కష్టాలు చెప్పుకొచ్చారు కార్తికేయ. తాను హీరో అయ్యాక ఇంటికొచ్చి నేరుగా మాట్లాడుతనానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ విషయంపై ఇంట్లో గొడవలు కూడా పడ్డాన్నన్నారు.

అనుకున్నట్లుగానే అన్నీ కుదిరి ఈ నెల 21 ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పేశారు కార్తికేయ. అనంతరం తన ప్రేయసికి స్టేజ్​పైనే ప్రపోజ్​ చేశారు.

Also read: Janhvi Kapoor : దుబాయ్‌ ఎడారిలో జాన్వీక‌పూర్ అందాల ఆరబోత

Also read: Pakka Commercial : గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

రాజావిక్రమార్క సినిమా గురించి..

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో రామారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ సినిమాలో కథానాయిక.

ఇక సినిమా టైటిల్ ముందు వేరే అనుకున్నామని కార్తికేయ వెల్లడించారు. ఇది నిజానికి చిరంజివి సినిమా టైటిల్ అని.. అది పెట్టుకోవాలనే ధైర్యం చాలలేదని చెప్పారు. అయితే చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తు ఆయన్ను ఆరాదిస్తున్నందుకు.. ఓ ఫ్యాన్​గా ఆ టైటిల్ వాడుకోవచ్చనిపించినట్లు తెలిపారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులో హీరోగా వస్తున్న సమయంలోనే.. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్​గా మెప్పించారు కార్తికేయ. ఇక తమళ అగ్రహీరో.. అజిత్​ సినిమా వాలిమైలో కూడా విలన్​గా చేస్తున్నారు కార్తికేయ. ఈ సినిమా ఇంకా విడుదలవ్వాల్సి ఉంది.

Also read: Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్‌'..??

Also read: Prabhas Fan Suicide: ప్రభాస్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్ వైరల్.. ‘యూవీ క్రియేషన్స్ సంస్థే కారణం!’

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News