Vikram K kumar: హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు.. ఫైనల్ గా రంగం సిద్ధం

Vikram Kumar Next Film: 13బి, ఇష్క్, మనం , 24 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఆయన తన కెరియర్ మొదట్లో తీసిన సినిమాలతో అసలు విక్రమ్ కె కుమార్ సినిమా అంటేనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని అందరూ అనుకునేలా చేశారు. అలాంటి విక్రమ్ కె కుమార్ నాగచైతన్య థ్యాంక్యూ సినిమా తరువాత చాలా సైలెంట్ అయిపోయాడు. మరి విక్రమ్ కె కుమార్ తన తదుపరి సినిమాగా ఎం చేస్తున్నాడు.. ఎవరితో చేస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 01:59 PM IST
Vikram K kumar: హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు.. ఫైనల్ గా రంగం సిద్ధం

Vikram Kumar Next Film: మన తెలుగు సినిమా ప్రేక్షకులు తెలుగు సినిమాలనే కాకుండా ఇతర భాష సినిమాలని కూడా ఎంకరేజ్ చెయ్యడం లో ముందుంటారు. అలా ఎంతో మంది దర్శకులని  మన వాళ్ళు ఎంకరేజ్ చేసి బ్రహ్మరధం పట్టారు. అలాంటి వాళ్ళలో విక్రమ్ కె కుమార్ ఒకరు. 13బి వంటి హారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన విక్రమ్ కె కుమార్ ఆ తరువాత నితిన్ తో ఇష్క్ వంటి సినిమాని తిసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఆయన అక్కినేని కుటుంబం తో కలిసి తెరకెక్కించిన మనం సినిమా గురించి మన అందరికి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికి కూడా 'మనం' సినిమా అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సినిమా అని అక్కినేని వారు కూడా చెప్పుకుంటుంటారు.

తెలుగు లోనే కాకుండా తమిళ్ లో సూర్య తో 24 వంటి సినిమాని తిసి అక్కడ కూడా దర్శకుడిగా అందరి మెప్పుని పొందాడు విక్రమ్ కె కుమార్. కానీ విక్రమ్ కె కుమార్ లాస్ట్ మూవీ అయిన థ్యాంక్యూ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఏళ్ళు గడుస్తున్న కూడా విక్రమ్ కె కుమార్ తన తదుపరి సినిమా ఏంటి అనేది ప్రకటించలేదు. 

కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్ కె కుమార్ కొత్త ప్రొడ్యూసర్ అయిన వేణు దోనేపూడి నిర్మాణం లో ఒక సినిమా చెయ్యడానికి సైన్ చేసాడట. 

దీనికి సంభందించిన కథ పనులు కూడా చకచకగా జారిగిపోతున్నాయి అని వినికిడి. కాగా ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉన్నారట ఈ డైరెక్టర్. విక్రమ్ కుమార్ కి థాంక్యూ ముందు వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా కేవలం యావరేజ్ సినిమా గానే మిగిలింది. అందుకే ఈసారి సూపర్ హిట్ అందుకోవాలని.. తన గత చిత్రాలలో చేసిన తప్పుల్ని ఈ సినిమాలో రిపీట్ చెయ్యకుండ జాగ్రత్తలు తీసుకుంటూ విక్రమ్ కె కుమార్ అడుగులు వేస్తున్నాడు అని వినికిడి. కాగా ఈ సినిమాలో నటించబోయే హీరో హీరోయిన్ల గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు.

ఇదిలా ఉంటే వేణు దోనేపూడి ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో గోపీచంద్ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే విక్రమ్ కె కుమార్ సినిమా మొదలవుతుంది.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News