Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ..

Family Star Teaser: గీతా గోవిందం లాంటి బ్లాక బస్టర్ తరువాత మరోసారి పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.  ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉండగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ ఈ చిత్రం పైన ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచింది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 10:25 AM IST
Family Star Teaser: ఫ్యామిలీ స్టార్ టీజర్ విడుదల.. మిడిల్ క్లాస్ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda Family Teaser: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్.  ఈ చిత్రం టీజర్ ముందుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ.. ఫైనల్ గా రాత్రి 9 పైన ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు సినిమా మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో మెప్పిస్తోంది.

గీతా గోవిందం సినిమా లాగానే మరోసారి ఈ చిత్ర టీజర్ ఆధ్యాంతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగి ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా ఈ చిత్ర టీజర్ చూస్తే గీతా గోవిందంలో లవ్ స్టోరీ తో ఆకట్టుకున్న విజయ్.. పరశురామ్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ తో ఆకట్టుకోనున్నారని అర్థమవుతుంది.

ఒక చిన్న టీజర్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కనిపించే చాలా సీన్స్ కవర్ చేసేసారు దర్శకుడు. ఒక మంచి మాస్ బీట్ మ్యూజిక్ తో మొదలైన ఈ టీజర్.. ఆ పాట మొత్తం విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ని వర్ణిస్తూ.. అతని ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ చూపించారు. ముఖ్యంగా రౌడీ యటిట్యూడ్ చూపిస్తూ విజయ్ తన లిటిల్ ఫింగర్ ని విలన్ కి చూపివ్వడం హైలైట్ గా నిలిచింది. మిడిల్ క్లాస్ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు హీరోయిజంని చూపించేలా టీజర్ ని మంచిగా ప్లాన్ చేశారు సినిమా యూనిట్.

కాగా ఈ టీజర్ చివరి సీన్ మరింత హైలెట్ గా నిలిచింది. టీజర్ చివరిలో హీరోయిన్ మృనాల్ ఠాకూర్ ని చూపించగా.. "ఏమండీ... నేను కాలేజీకి వెళ్లాలి... కొంచెం దించేస్తారా?" అని మృణాల్ అడుగుతుంది.. దానికి సమాధానంగా విజయ్ "ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా" అని ఇచ్చే ఆన్సర్ అందరిని తెగ అలరిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News