Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..

Venu Swamy  Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 9, 2024, 11:50 AM IST
Venu Swamy : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు.. జాతకం చెప్పేసిన వేణుస్వామి..

Venu Swamy astrologyon Naga chiatanya Sobhita: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య, శోభితతో నిన్ననే నిశ్చితార్దం చేసుకున్నారు. గురువారం ఉదయం 9.42 నిమిషాలకు జరిగిందని నాగార్జున అఫీషియల్ గా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా వీరి జీవితం ఎలా ఉండబోతుందో అని ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి వారి జాతకం చెప్పారు. నాగ చైతన్యది జాతక రీత్యా ఆశ్లేష  నక్షత్రం. అంతేకాదు ఆయన జాతక చక్రంలో రవి, శని కలయిక వలన ఆయన తండ్రి స్థానం బాగాలేదని చెప్పారు. జాతక రీత్యా రవి తండ్రి స్థానాన్ని సూచిస్తుందని చెప్పారు. అందుకే చైతూ తల్లిదండ్రులు చిన్నపుడే విడిపోయినట్టు చెప్పుకొచ్చారు. తన తండ్రి స్థానంతో పాటు తను తండ్రి స్థానం అంతగా బాగాలేదు. వివాహాం తర్వాత తండ్రి అయ్యే యోగం లేదని చెప్పుకొచ్చాడు. IVR, టెస్ట్ ట్యూబ్ బేబి ద్వారా కంటే చెప్పలేము అన్నారు. సహజ సిద్ధంగా తండ్రి అయ్యే యోగం లేదన్నారు. సమంత జాతకం విషయానికొస్తే.. భరణి నక్షత్రం.. మేషరాశి.. అమావాస్య రోజు జన్మించింది. సమంత జాతకంలో కుజ దోషంతో పాటు కాల సర్ప దోషం ఉంది.  వాళ్లు కుటుంబంలో చిచ్చు రేగుతుంది. వాళ్లు ఖచ్చితంగా విడిపోతారంటూ చెప్పిన పాత వీడియోను ఇందులో ప్లే చేసారు.

తాజాగా నాగ చైతన్య, శోభితా జాతకాలను పరిశీలించి వీళ్లిద్దరు కూడా కలిసి ఉండలేరని వేణుస్వామి వాళ్ల జాతకాలను పరిశీలించి చెప్పడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముహూర్తం తీసుకుంటే.. ఏదో గల్లిలోని జ్యోతిష్యుడు పెట్టిన ముహూర్తం. వేణుస్వామి చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరా ఫల్గుణి నక్షత్రం, కన్యా లగ్నంలో  జరిగింది.  

వైవాహిక జీవితానికి సంబంధించి ఏడో స్థానం లో ఏ గ్రహం ఉండకూడదు. కానీ వీళ్లు ఎంగేజ్మమెంట్ చేసుకున్న ముహూర్తం నుంచి ఏడో స్థానంలో రాహువు ఉన్ాడు.  అంటే భార్యా లేదా భర్త స్థానం (కళత్ర స్థానం)లో  రాహువు ఉన్నాడు. కళత్ర స్థానం అంటే భార్య లేదా భర్త, పిల్లలు వంటివి సూచిస్తాయి.  లగ్నంలో చంద్రుడు, కేతువు, వ్యయ స్థానమైన పన్నెండు స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నాడు.

శని దృష్టి ముఖ్యంగా బుధుడు, శుక్రుడు మీదున్నాడు. కళత్ర స్థానంలో రాహువు ఉన్నాడు. ఈ నిశ్చితార్థ ముహూర్తం పండితులు పెట్టినట్టు లేదు. నాగార్జున..త్రిపుల్ 8 వచ్చేలా ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు 8వ నెల 8వ తారీఖు.. 2024 కలిపితే.. 8. సంఖ్యాశాస్త్రం ప్రకారం నిర్ణయించుకున్నారు. ఈ ముహూర్తం నిషేధం. నిశ్చితార్థానికి ఇది అసలు పనికి రాదన్నారు.

అప్పట్లో సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పగానే.. నన్ను అందరు బండ బూతులు తిట్టిన విషయాన్ని వేణు స్వామి ప్రస్తావించారు. సమంతది మేషరాశి.. నాగ చైతన్యది కర్కాటక రాశి. సమంతగారు పుట్టింది అమావాస్య రోజు. మరోవైపు శోభిత కూడా అమావాస్య రోజు పుట్టింది. ఈమె రాశి ధనుస్సు రాశి. అపుడు కూడా సమంత, నాగ చైతన్యలు ఇద్దరు ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోతారని చెప్పాను. ఇపుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం చూసి విడిపోతారని ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత తనను బండ బూతులు తిట్టేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ జ్యోతిష్యాన్ని ఎవరు కొట్టిపారేయద్దని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News