O Manchi Ghost: అదిరిపోయిన OMG టీజర్.. నవిస్తూ భయపెట్టేశారు

O Manchi Ghost Teaser: OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవ్విస్తూ భయపెట్టేలా టీజర్‌ను కట్ చేశారు. టీజర్‌లో డైలాగ్స్‌ అదిరిపోయేలా నవ్వించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2024, 03:53 PM IST
O Manchi Ghost: అదిరిపోయిన OMG టీజర్.. నవిస్తూ భయపెట్టేశారు

O Manchi Ghost Teaser: ప్రస్తుతం టాలీవుడ్‌లో హార్రర్, కామెడీ మిక్స్‌తో వస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆడియన్స్‌ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటు ఓటీటీ.. అటు థియేటర్స్‌లో ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తాజాగా ఇదే సక్సెస్ ఫార్ములాతో ఆడియన్స్ ముందుకు రానుంది OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో రూపొందుతుండగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. 

Also Read: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరు

తాజాగా OMG నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. నవిస్తూ.. భయపెట్టేలా టీజర్‌ను కట్ చేశారు. 'పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది' అనే డైలాగ్‌తో టీజర్‌ను స్టార్ట్ చేశారు. 'ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా.. కాంచన కజిన్‌వైనా..' అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్‌ నవ్వు తెప్పిస్తోంది. ఇక షకలక శంకర్ చెప్పిన డైలాగ్ టీజర్‌గా హైలెట్‌గా నిలిచింది. 'నేను మోహిని పిశాచి మోహం తీర్చా.. కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా..' తన స్టైల్‌లో చెప్పి నవ్వులు పూయించాడు. దెయ్యం పాత్రలో నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా ఉన్నారు.

టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయేలా ఉన్నాయి. ఆండ్రూ సినిమాటోగ్రఫీ సూపర్‌గా ఉండగా.. అనూప్ రూబెన్స్ ఇచ్చిన ఆర్ఆర్ టీజర్‌లో ఎక్కువగా హైలెట్ అవుతోంది. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేయగా.. ఎడిటింగ్ బాధ్యతలను ఎం.ఆర్.వర్మ నిర్వర్తించారు. ఇక అతిత్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

సాంకేతిక సిబ్బంది:
==> డైరెక్టర్: శంకర్ మార్తాండ్
==> ప్రొడ్యూసర్: డా.అబినికా ఇనాబతుని
==> బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్‌లు
==> సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
==> మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
==> ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
==> ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
==> కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
==> విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)

Also Read: Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News