Vanangaan Movie : ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సూర్య.. ఎక్కడ తేడా కొట్టిందంటే?

Suriya Quits Bala Vanangaan Movie సూర్య తాజాగా తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. నాచురల్ డైరెక్టర్ బాలా, సూర్యకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో బాలా సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 04:07 PM IST
  • కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా సూర్య, బాలా చిత్రం
  • బాలా, సూర్యకు మధ్య విబేధాలు
  • బాలా వనంగాన్ నుంచి తప్పుకున్న సూర్య
Vanangaan Movie : ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సూర్య.. ఎక్కడ తేడా కొట్టిందంటే?

Suriya Quits Bala Vanangaan Movie : సూర్య ప్రస్తుతం నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించేసుకున్నాడు. కరోనా అంటూ రెండేళ్లకు స్టార్ హీరోలంతా కూడా ఇంట్లోనే ఉంటే.. సూర్య మాత్రం ఓటీటీలో దుమ్ములేపేశాడు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా.. ఆస్కార్ ఎంట్రీకి భారత ప్రభుత్వం అధికారికంగా నామినేట్ చేసింది కూడా. అయితే ఆస్కార్ మాత్రం అందని ద్రాక్షలానే మారింది. కానీ సూర్య నటన మాత్రం జనాలను మెప్పించింది.

అలాంటి సూర్య తీసే సినిమాలపై ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఇంపాక్ట్ ఏర్పడింది. అయితే సూర్య నటించిన ఈటీ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. అయినా సూర్య సినిమాలకు మాత్రం గిరాకీ తగ్గడం లేదు. సూర్య వరుసపెట్టి చిత్రాలను చేస్తున్నాడు. సూర్య ప్రస్తుతం వాడివాసల్ అనే సినిమాను చేస్తున్నాడు. శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా బాలా సినిమాను కూడా ఈ ఏడాది ప్రారంభంలో మొదలుపెట్టేశాడు.

నంద, శివపుత్రుడు వంటి సినిమాల తరువాత బాలా దర్శకత్వంలో సూర్య నటించబోతోన్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ కొన్ని రోజులు షూటింగ్ చేశాక గానీ తెలియదు ఈ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందని, క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట.

సూర్యకు ఈ స్టోరీ తగదని నిర్ణయించుకున్నాడట. మార్పులు చేర్పులు కూడా చేశారట. కానీ ఈ కథ మాత్రం తనకు సూట్ అవ్వడం లేదని అనుమానం వ్యక్తం చేశాడు. బాలా కూడా సూర్యను ఫోర్స్ చేయలేదట.. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడట.

భవిష్యత్తుల్లో మళ్లీ సూర్యతో సినిమా చేస్తానని, తాను మాత్రం ఇప్పుడు ఈ వనంగాన్ మూవీనే పూర్తి చేస్తానని బాలా తెలిపాడు. మరో వైపు సూర్య కూడా బాలా సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మరి నిజంగానే లోలోపల ఏమైనా జరిగి ఉంటుందా? అన్నది తెలియడం లేదు.

Also Read : Bigg Boss Shiva Jyothi : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన శివ జ్యోతి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి

Also Read : Jagapathi Babu : అరవై ఏళ్లకు నేర్చుకున్నాడట.. రమ్ము, విస్కీ అంతా అదేనట.. వంటగదిలో జగ్గూ భాయ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News