Sai Pallavi : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. పార్టీలు, పబ్‌ల్లో తిరిగే హీరోయిన్లు ఒక వైపు.. సాయి పల్లవి మరో వైపు

Sai Pallavi At Puttaparthi సాయి పల్లవి ఎప్పుడూ ప్రత్యేకమే. ఎక్కడ కనిపించినా, ఏ సినిమా చేసినా కూడా సాయి పల్లవి ఎప్పుడూ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటేస్తుంది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల్లో  సాయి పల్లవి కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 08:38 AM IST
  • న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
  • పార్టీలు, పబ్బుల్లో హీరోయిన్లు
  • దైవ చింతనలో సాయి పల్లవి
Sai Pallavi : న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. పార్టీలు, పబ్‌ల్లో తిరిగే హీరోయిన్లు ఒక వైపు.. సాయి పల్లవి మరో వైపు

Sai Pallavi New Year Celebration హీరోయిన్లందరిలోనూ సాయి పల్లవి వేరయా.. అనే మాట కచ్చితంగా నిజమే. సహజమైన అందంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతకు మించి తన మంచితనం, మంచి మనసుతో ప్రతీ ఇంట్లో సొంత మనిషిలా మారింది. అయితే సాయి పల్లవి గత కొన్ని రోజులుగా ఎక్కడా చడీచప్పుడూ లేకుండా ఉండిపోయింది. ఆమె నటించిన విరాట పర్వం డిజాస్టర్ అయింది. గార్గి సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ కాస్త ట్రోలింగ్‌కు గురైంది. దీంతో సాయి పల్లవి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది.

 

తాజాగా సాయి పల్లవి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ కాసాగింది. ఎందుకంటే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటూ మన హీరోయిన్లు పార్టీలు, పబ్బులు, బీచ్‌లు అంటూ తిరుగుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం చక్కగా దేవుడి సన్నిధిలో దర్శనమిచ్చింది. పుట్టపర్తిలో సాయి పల్లవి భజన చేసుకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియోను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ అంటే ఇలా సాయి పల్లవిలా ఉండాలని అంటున్నారు.

అందుకే సాయి పల్లవికి ఇంతటి క్రేజ్ అని జనాలు అంటున్నారు. అయినా సాయి పల్లవికి హిట్టు, ఫ్లాపులతో సంబంధం ఉండదని, ఆమె క్రేజ్ ఎప్పటికీ అలానే ఉంటుందని, ఏ వివాదాలు కూడా సాయి పల్లవిని కిందకు లాగలేవని, అందరిలోనూ ఆమె మిన్న అంటూ ఇలా జనాలు ఆమెను పొగిడేస్తున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం ఇప్పుడు ఏ సినిమాను ఒప్పుకున్నట్టుగా కనిపించడం లేదు.

విరాటపర్వం సమయంలో హిందూ, ముస్లిం, గోరక్షణ పేరిట జరిగే దాడుల మీద ఆమె చేసిన కామెంట్లు, ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మీద చేసిన కామెంట్లు ఎంతటి దుమారానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. హింస ఎక్కడ జరిగినా, ఏ మతంలో జరిగినా తప్పని చెప్పడమే తన ఉద్దేశ్యం అని సాయి పల్లవి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News