HBD Sai Dharam tej: గొప్ప మనసు చాటుకున్న సాయిధరమ్ తేజ్.. వారికి రూ. 20 లక్షల విరాళం..

HBD Sai Dharam tej: ఇవాళ సాయిధరమ్ తేజ్ బర్త్ డే. ఈ సందర్భంగా గొప్ప మనసును చాటుకున్నాడు ఈ మెగా హీరో. అమరవీరుల కుటుంబాలకు, పోలీసులకు రూ. 20 లక్షల విరాళం ప్రకటించాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 11:23 PM IST
HBD Sai Dharam tej: గొప్ప మనసు చాటుకున్న సాయిధరమ్ తేజ్.. వారికి రూ. 20 లక్షల విరాళం..

Sai Dharam Tej Birthday Celebrations: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గొప్ప మనుసు చాటుకున్నాడు. ఇవాళ(అక్టోబరు 15) సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ అధికారుల భార్యలకు రూ.10 లక్షలు.. అలాగే ఏపీ-తెలంగాణ పోలీసులకు రూ.10 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. నేను తీసుకున్న ఈ నిర్ణయంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నానని మెగా మేనల్లుడు ట్వీట్ చేశాడు. సాయి తేజ్ నిర్ణయంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు, అభిమానులు ఈ మెగా హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

విరూపాక్ష, బ్రో సినిమాల సూపర్ హిట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మూవీ గాంజా శంకర్‌. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు మెగా హీరో పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ ఊరమాస్‌ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాత వ్యవహారిస్తున్నారు. . సితార సంస్థతో కలిసి త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై గాంజా శంకర్‌ను నిర్మిస్తుంది. ధమకా, బలగం సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న భీమ్స్‌ ఈ సినిమాకు స్వరాలు అందించబోతున్నాడు. సాయితేజ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

Also Read: Snake Bite: కుక్కలను కాపాడబోయి పాము కాటుకు గురైన 2018 మూవీ రైటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News