Puneeth Rajkumar's last rites: పునీత్ రాజ్​కుమార్​ అంత్యక్రియలు పూర్తి- సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

Puneeth Rajkumar funeral: గుండె పోటు కారణంగా శుక్రవారం మృతి చెందిన పునీత్ రాజ్​కుమార్​ అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు.. వేలాది మంది అభిమానుల మధ్య ఆయనకు అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 10:42 AM IST
  • పునీత్ రాజ్​కుమార్ అత్యంక్రియలు పూర్తి
  • హాజరైన కర్ణాటక సీఎం, రాజకీయ, సినీ ప్రముఖులు
  • కంఠీరవ స్టూడియోలో పునీత్​ భౌతిక దేహాం ఖననం
Puneeth Rajkumar's last rites: పునీత్ రాజ్​కుమార్​ అంత్యక్రియలు పూర్తి- సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు

Puneeth Rajkumar's last rites: కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ ఉదయం (ఆదివారం) పూర్తయ్యాయి. పునీత్ అంత్యక్రియలకు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారయ్యారు.

కుటుంబ సభ్యులతో పాటు, అందరూ బరువెక్కిన హృదయాలతో పునీత్ రాజ్​కుమార్​కు తుది వీడ్కోలు పలికారు. పునీత్‌ రెండో సోదరుడు రాఘవేంద్ర.. కుమారుడు వినయ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

అభిమాల రోధనల మధ్యే అంతిమయాత్ర..

అభిమానులు, ఇతరుల సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంలో దాదాపు రెండు రోజుల పాటు పునీత్ భౌతిక దేహాన్ని ఉంచారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్​ మధ్య కంఠీరవ స్టూడియో వరకు పునీత్ అంతిమ యాత్ర సాగింది. కంఠీరవ స్టేడియం, కంఠీరవ స్టూడియో పరిసర ప్రాంతాలన్నీ పునీత్ అభిమానులతో నిండిపోయాయి. పునీత్ నినాదాలలో ఆ ప్రాంతాలు మార్మోగాయి. పునీత్​ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక అభిమానుల గుండె పగిలేలా రోధించారు.

Also read: Puneeth Rajkumar Death News: పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Also read: Puneeth Rajkumar's death: పునీత్ రాజ్‌కుమార్ మృతికి అసలు కారణం ఇదేనా ?

గుండెలవిసేలా రోధించిన శివరాజ్​కుమార్​..

పునీత్​ రాజ్​కుమార్​కు తుది వీడ్కోలు పలికే సమయంలో ఆయన భార్య అశ్వినీ రేవంత్​, ఇద్దరు కూతుళ్లను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పునీత్ పెద్దన శివ రాజ్​కుమార్​ (శివన్న).. తమ్ముడితో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని గుండె పగిలేలా రోధించారు. దీనితో అక్కడున్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

గుండెపోటుతో పునీత్ మృతి..

శుక్రవారం ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్​కు గుండె పోటు రావడంతో.. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు వ్యక్తిగత సిబ్బంది. వైద్యులు తీవ్రంగా శ్రమించినా పునీత్ ప్రాణాలు కాపాడలేకపోయారు. పునీత్ మృతి చెందారన్న వార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పునీత్ మృతితో కన్నడ సినిమా పరిశ్రమతో పాటు భారతీయ చిత్రసీమ మొత్తం ఆయనకు నివాళులర్పించింది. అన్ని భాషల నటీ నటులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Also read: Balakrishna pays Final Respects to Puneeth: పునీత్‌ను కడసారి చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

Also read: Puneeth Rajkumar's last rites: పునీత్ చివరి చూపు కోసం.. బెంగళూరుకు టాలీవుడ్ అగ్ర హీరోలు

పునీత్​ను కడసారి చూసి..

పునీత్ రాజ్​కుమార్ కుటుంబానికి టాలీవుడ్​తో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టాలీవుడ్​ అగ్ర హీరోలు ఇతర నటీనటులు శనివారం బెంగళూరు చేసుకుని పునీత్​ను చివరి సారి చూసి తమ నివాళులర్పించారు.

అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్​, జూనియర్ ఎన్టీఆర్​, శ్రీకాంత్ సహా నటుడు ఆలీ మరికొంత మంది టాలీవుడ్​ నుంచి పునీత్​ రాజ్​కుమార్​కు ప్రత్యక్షంగా నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

Also read: Puneeth Raj Kumar’s eyes: పునీత్ కుమార్ నేత్రదానం.. ఫోటోలు, వీడియోలు వైరల్

Also read: Puneeth Rajkumar Ashwini Revanth : పునీత్‌ రాజ్‌కుమార్, అశ్వినిల లవ్‌ స్టోరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News