Priyanka Chopra Daughter: ఎట్టకేలకు కూతురి ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక.. మీరు చూశారా?

Priyanka Chopra Reveals Daughter's Face: ఇన్ని రోజుల పాటు తన కుమార్తె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన ప్రియాంక చోప్రా ఈసారి తన కుమార్తె ముఖాన్ని రివీల్ చేసింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 31, 2023, 11:34 AM IST
Priyanka Chopra Daughter: ఎట్టకేలకు కూతురి ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక.. మీరు చూశారా?

Priyanka Chopra Reveals Daughter's Face: జంషెడ్పూర్ లో జన్మించిన ప్రియాంక చోప్రా ఒకప్పుడు మాజీ ప్రపంచ సుందరి. నిజానికి ఆమె నటిగా మారకముందు మోడలింగ్ చేసేది తరువాత ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకొని ఒక్కసారిగా హాట్  టాపిక్ గా మారింది. ఒక తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కాలంలో అనేక సినిమాల్లో నటిస్తూ క్రేజీయస్ట్ హీరోయిన్గా మారిపోయింది.

ఎక్కువగా హిందీ సినిమాల్లోనే కనిపించిన ఆమె అడపాదడపా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చేస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఆమె అమెరికా వెళ్లి నిక్ జోనస్ అనే ఒక సింగర్ ని వివాహం చేసుకుంది. తనకంటే చాలా చిన్నవాడైన ఆ వ్యక్తిని చేసుకోవడంతో ఆమె మీద అనేక రకాల ట్రోలింగ్స్ కూడా ఆ మధ్య వచ్చాయి. తన కంటే పదేళ్ల చిన్నవాడయిన నిక్ జోనస్ తో ఆమె ప్రేమలో పడటమే కాదు ఇటీవలే అతని ద్వారా తల్లి కూడా అయింది.

ఆమె ఒక అందమైన పాపకు ప్రియాంకా చోప్రా జన్మనిచ్చింది, తాజాగా ఆమె కూతురికి సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రియాంక చోప్రా తన సినిమాలు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తన కూతురు మాల్తీ మేరీని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

గతంలో కూడా ఆమె తన కుమార్తెకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేసేది కానీ ఆమె ముఖం కనబడకుండా జాగ్రత్తపడేది కానీ ఇప్పుడు తొలిసారిగా ఆమె తన కుమార్తెను మీడియా కంటికి చిక్కేలా చేసింది. జోనాస్ బ్రదర్స్ వాక్ అఫ్ ఫ్రేమ్ అనే ఒక సింగింగ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ లో తన కుమార్తెతో కలిసి ప్రియాంక చోప్రా  సందడి చేసింది. ఇక ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లి అతనితోనే..క్లారిటీ ఇచ్చేసిన తల్లి!

Also Read: Chiranjeevi Tweet: ఎంతో ఉపశమనాన్నిచ్చింది..ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News