ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ విడిపోనున్నారా?.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం

​Priyanka Chopra Instagram Name: బాలీవుడ్ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా.. తన భర్త నిక్ జోనస్ తో విడిపోనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రియాంక వినియోగిస్తున్న సోషల్ మీడియా ఖాతా ప్రొఫైల్ పేర్ల నుంచి జోనస్ అనే పేరును తొలిగించడం వల్ల ఈ ఊహాగానులు జోరుగా సాగుతున్నాయి. అందులో నిజమెంతో తెలియాల్సిఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 08:59 AM IST
    • ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో జోనస్ పేరును తొలగించిన ప్రియాంకా చోప్రా
    • వివాహ బంధానికి ప్రియాంక ఫుల్ స్టాప్ పెట్టనుందా?
    • ఇదే విషయమై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ విడిపోనున్నారా?.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
Priyanka Chopra Instagram Name: సినిమా స్టార్లు ఏ పని చేసినా.. అది పెద్ద సెన్సేషనల్ వార్తగా నిలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వారు చేసే ప్రతి పనిని ఫ్యాన్స్ బూతద్దంలో చూస్తున్నారు. సెలెబ్రిటీలు వ్యవహరించే శైలి కొన్ని సందర్భాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ విడిపోయే ముందు సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అక్కినేని ఇంటిపేరును తొలగించింది. అక్కడి నుంచి వారిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తర్వాత అందరూ అనుకున్నట్లే ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటన చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్‌ మీడియాలో జరిగిన ఓ పరిణామం సెన్సేషన్‌గా మారింది. 

ఆ జంట మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌. 2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ఈ ప్రేమ జంట తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈ జంట కలిసి పాల్గొంది. 

అయితే తాజాగా ప్రియాంక చేసిన ఓ పోస్ట్‌ పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలగించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఇంతకీ ఈ జంట మధ్య ఏమైంది అని చర్చించుకుంటున్నారు.

ఇదే విషయమై ప్రియాంకా చోప్రా తల్లి స్పందించింది. “ఇవన్నీ వట్టి పుకార్లేనని తేల్చి చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేరును మార్చుకున్నప్పటికీ వారి మధ్య ఎలాంటి మనస్పర్థాలు లేవ”ని ఆమె తెలిపారు. 

Also Read: జెర్సీ హిందీ మూవీ ట్రైలర్ లాంచింగ్‌కి ముహూర్తం ఖరారు

Also Read: తనయుడు భార్గవ్ రామ్‌తో తారక్.. వైరల్ అవుతున్న లవ్లీ ఫోటో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News