Most popular male Telugu film stars April 2023: ప్రతినెలా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భాషా ప్రాతిపదికన తెలుగు స్టార్లు టాప్ టెన్ లో ఎవరున్నారు? మలయాళ స్టార్లు టాప్ టెన్ లో ఎవరున్నారు? అనే విధంగా దాదాపు అన్ని భాషలకు చెందిన హీరోల లిస్టు ప్రకటించడమే కాదు పాన్ ఇండియా లెవెల్లో టాప్ టెన్ లో ఎవరున్నారనే విషయాన్ని కూడా ఒక లిస్టుగా చేసి ప్రకటిస్తూ వస్తోంది ఆర్మాక్స్ మీడియా సంస్థ.
సోషల్ మీడియాలో మీడియాలో జరుగుతున్న చర్చను ఆధారంగా చేసుకుని ఈ మేరకు ఈ లిస్టును ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలకు గాను తాజాగా లిస్టు విడుదలైంది. ఈ లిస్టులో ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించగా తర్వాతి స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఇక మూడవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకోగా నాలుగో స్థానాన్ని అల్లు అర్జున్ దక్కించుకున్నారు.
Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
మహేష్ బాబు ఈ లిస్టులో ఐదవ స్థానం దక్కించుకోగా దసరా సినిమాతో హిట్టు అందుకున్న నాని ఆరవ స్థానం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా చేసి చాలా కాలమే అయినా ఆయన ఈ లిస్టులో ఏడవ స్థానం సంపాదించుకోగా గతంలో 9, 10 స్థానాలకు పరిమితమైన చిరంజీవి ఈసారి కొంత ముందుకు వచ్చి ఎనిమిదవ స్థానం దక్కించుకున్నాడు.
చిరంజీవి తరువాత విజయ్ దేవరకొండ తొమ్మిదవ స్థానం దక్కించుకుంటే ఆ తర్వాత రవితేజ పదవ స్థానం దక్కించుకున్నాడు. సాధారణంగా కొందరు హీరోల సినిమాలో రిలీజ్ ఉన్నా లేకపోయినా వారి అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు వారి గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగేలా చూసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయా హీరోలు సినిమాలో రిలీజ్ ఉన్నా లేకపోయినా ఈ లిస్టులో మాత్రం ఎప్పటికప్పుడు స్థానం సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమా వచ్చి అయితే ఏడాది పూర్తవుతున్న ఆయన మాత్రం మొదటి స్థానం దక్కించుకుంటూ రావడం గమనార్హం.
Also Read: Salaar Release Date:సలార్ రిలీజ్ డేట్ టెన్షన్.. అసలు విషయం చెప్పేసిన టీం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook