Prabhas: ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదు.. హనుమాన్ పై ప్రభాస్ స్వీట్ కామెంట్స్

Prabhas About Hanuman: సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలో సినిమాలు ఫైట్ అండ్ కలెక్ట్ చేయని కలెక్షన్స్ ఈ చిత్రం కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది.. ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 07:47 PM IST
Prabhas: ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదు.. హనుమాన్ పై ప్రభాస్ స్వీట్ కామెంట్స్

Prabhas About Prasanth Varma: ఈ సంవత్సరం సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల కాగా.. హనుమాన్ సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి అయిపోయిన ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. సినీ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొదట్లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన కానీ ఇప్పుడు మాత్రం పెద్ద స్టార్ సైతం ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు.

సినిమా సెలబ్రెటీస్ మాత్రమే కాదు..రాజకీయ నాయకులు సైతం ఈ చిత్రాన్ని చూసి మూవీ టీంని అభినందిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి ఇప్పుడు మన డార్లింగ్ హీరో ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మని అభినందిచారట. ఈ విషయానికి ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

హనుమాన్ సినిమా విడుదలైన వెంటనే మన రెబల్ స్టార్ ని కలిసారంట ప్రశాంత్ వర్మ. ఇక ఈ చిత్రం గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. “ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంట కదా. క్లైమాక్స్ ఇరగదీసేశావు అంటగా” అంటూ స్వీట్ గా మాట్లాడారట. అలాగే సినిమా చూసేందుకు తనకి కూడా ఒక షో ఏర్పాటు చేయమని దర్శకుడిని కోరారట. అయితే ప్రస్తుతం ప్రభాస్ షూటింగులతో బిజీగా ఉండడం వల్ల ఇంకా చూడలేదని.. ప్రభాస్ చూసిందే ఆయన రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని దర్శకుడు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

కాగా ప్రశాంత్ వర్మ తన సక్సెస్ఫుల్ హనుమాన్ సినిమా చివర్లోనే ‘జై హనుమాన్’ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం  ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు అందరూ. ప్రశాంత్ వర్మ కూడా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని రీసెంట్ గా స్టార్ట్ చేసేసారు. 2025కి ఈ సినిమాని తీసుకు వచ్చేందుకు మూవీ టీం సిద్దమవుతుంది. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషలలో హనుమాన్ సూపర్ సక్సెస్ సాధించగా.. తదుపరి రాబోయే ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లన్నీ కూడా అన్ని భాషలలో విడుదల కాబోతున్నాయి. మరి ఈ డైరెక్టర్ సైతం రాజమౌళి, సుకుమార్ లాగా మన తెలుగు నుంచి వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతారేమో చూడాలి.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News