Ram Mandir: అయోధ్యకు చేరుకున్న పవర్ స్టార్, సూపర్ స్టార్.. వీడియో వైరల్

Pawan Kalyan: ప్రస్తుతం భారతదేశం మొత్తం రేపు జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవం గురించి 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు అయోధ్య చేరుతున్నారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2024, 08:14 PM IST
Ram Mandir: అయోధ్యకు చేరుకున్న పవర్ స్టార్, సూపర్ స్టార్.. వీడియో వైరల్

Ram Mandir Inaugration: జనవరి 22 కోసం భారతదేశంలోని హిందువులందరూ ‌ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం రామ మందిర ప్రారంభోత్సవం. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం రేపు జనవరి 22.. అనగా సోమవారం ఘనంగా జరగబోతుంది. అయోధ్యలోని రాముని ప్రాణప్రతిష్ఠని కళ్లారా చూసేందుకు దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అక్కడికి బయలు దేరుతున్నారు. ఈ మహోత్సవానికి ఆహ్వానం అందిన సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరు ఈరోజు సాయంత్రం నుంచే అయోధ్య చేరుతున్నారు. సినీ, రాజకీయ రంగంలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.

తెలుగు హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తదితరులకి ఆహ్వానం అందగా తమిళ హీరోలలో రజనీకాంత్ ధనుష్ కి ఆహ్వానం అన్నింది. ఈక్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ కి  నేడు అయోధ్యకి చేరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

అయోధ్యకు చేరుకున్న పవర్ స్టార్ ఈ రామ మందిరం ప్రారంభోత్సవం గురించి  మాట్లాడుతూ.. “ఇది ఎన్నో సంవత్సరాల కల. 500 సంవత్సరాల తరువాత ఇప్పుడు నిజం కాబోతుంది. అందుకే చాలా సంతోషంగా ఉంది” అని తెలియజేశారు.

 

సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అక్కడికి చేరుకున్న వీడియో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు సైతం హాజరుకాబోతున్నారు. ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి వెళ్తున్న వారి లిస్టులో వీరి పేర్లు మాత్రం బయటకి వచ్చాయి. ఇక వీరికి కాకుండా మరి ఎవరన్నా తెలుగు హీరోలకి ఆహ్వానం అందిందా లేదా అన్న విషయం తెలియాలి అంతే మాత్రం రేపటి వరకు వేచి చూడాలి.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News