పరి టీజర్.. భయపెడుతున్న అనుష్క

అనుష్క శర్మ తర్వాతి చిత్రం 'పరి'కి సంబంధించిన టీజర్ విడుదలైంది.

Last Updated : Jan 10, 2018, 04:33 PM IST
పరి టీజర్.. భయపెడుతున్న అనుష్క
అనుష్క శర్మ తర్వాతి చిత్రం 'పరి'కి సంబంధించిన టీజర్ విడుదలైంది. ప్రొసిత్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుష్క దుష్టశక్తులు కలిగిన ఓ యువతి పాత్రలో నటిస్తోంది. టీజర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సినిమా మార్చి 2న విడుదలయ్యే అవకాశాలు వున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అందులో కచ్చితత్వం లేదు. ఈ టీజర్‌లో సాధారణ యువతి నుంచి మంత్రగత్తెగా అవతరిస్తున్నట్టుగా కనిపించే అనుష్కని చూస్తే, మీకు నిద్ర లేని రాత్రులు ఖాయం అంటున్నారు ఆడియెన్స్. 
వాస్తవానికి ఫిబ్రవరి 9నే విడుదల కావాల్సి వున్న ఈ సినిమా కొన్ని అనుకోని కారణాలతో వాయిదా పడింది. మరి ఈ టీజర్ ప్రకారం పరి సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యేనా లేదా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే ఛాన్స్ లేదు. NH-10, ఫిల్లౌరి లాంటి చిత్రాల తర్వాత అనుష్క స్వయంగా నిర్మిస్తున్న మూడో సినిమా ఇది.
 
 

Trending News