Amitabh Family: బాలీవుడ్‌లో మరో వారసుడి ఎంట్రీ

బాలీవుడ్‌లో బంధుప్రీతి ( Nepotism ) పై ఎన్ని విమర్శలు వస్తున్నా..ఆ పరంపర ఆగడం లేదు. మరో వంశాంకురం సినిమా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్‌షా ( Bollywood Badshah ), బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద ( Agastya nanda ) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సినిమాతో.

Last Updated : Jul 12, 2020, 06:51 PM IST
Amitabh Family: బాలీవుడ్‌లో మరో వారసుడి ఎంట్రీ

బాలీవుడ్‌లో బంధుప్రీతి ( Nepotism ) పై ఎన్ని విమర్శలు వస్తున్నా..ఆ పరంపర ఆగడం లేదు. మరో వంశాంకురం సినిమా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ బాద్‌షా ( Bollywood Badshah ), బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద ( Agastya nanda ) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సినిమాతో.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్‌పుత్ ( Sushant singh Rajput ) మరణంతో బంధుప్రీతికి సంబంధించి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నది ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ). కేవలం స్టార్ నటుల వారసత్వాన్నే ప్రోత్సహిస్తున్నారనేది ఈయనపై ఉన్న ఆరోపణ.అయితే ఈ విమర్శలు ఓ వైపు వస్తున్నా..మరో స్టార్ వారసుడిని రంగంలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారు కరణ్ జోహార్. బాలీవుడ్ బాద్‌షా,బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ( Big B Amitabh Bachan ) మనవడైన అగస్త్యానందను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. Also read: Deepika Padukone: దీపికా పదుకోనే స్లో వాక్ చూశారా.. వైరల్ అవుతోన్న వీడియో

అమితాబ్  వారసుడిగా  అభిషేక్ బచ్చన్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించినా ఆశించినంతగా గుర్తింపు సాధించలేకపోయారు.ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతాబచ్చన్ నందా ( Shweta Bachan nanda ) కుమారుడైన అగస్త్యానందను హీరోగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు. వయస్సు కేవలం 20 ఏళ్లే అయినా సోషల్ మీడియాలో అగస్త్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. Also read: Apsara Rani: అప్సరా రాణి గ్లామర్ సీక్రెట్ అదే

తన కుమారుడు అగస్త్య బాలీవుడ్ ఎంట్రీ త్వరలో ఉంటుందని  అతని  తల్లి శ్వేతా నంద గతంలోనే ప్రకటించారు. నెపోటిజమ్‌పై వస్తున్న విమర్శల్లో నిజం ఉన్నా లేకపోయినా..మరో వారసుడు మాత్రం బాలీవుడ్ ఎంట్రీ ( Bollywood Entry ) ఇవ్వబోతున్నాడు. యాక్టింగ్ లో  మెళుకువలు, బాడీ షేప్అప్  విషయంలో అగస్త్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. Also read: Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x