Narappa teaser: నారప్ప టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్

Narappa teaser updates: విక్టరి వెంకటేష్ ప్రస్తుతం 'నారప్ప' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2019లో తమిళ స్టార్ ధనుష్ అవార్డు గెలుచుకున్న 'అసురన్' అనే తమిళ సినిమా రీమేకే ఈ నారప్ప సినిమా. వెంకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమా షూటింగ్ ( Narappa movie shooting ) బుధవారం నుండి ఎన్నో కఠినమైన భద్రతా చర్యల మధ్య తిరిగి ప్రారంభమైంది.

Last Updated : Nov 6, 2020, 12:49 AM IST
Narappa teaser: నారప్ప టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్

Narappa teaser updates: విక్టరి వెంకటేష్ ప్రస్తుతం 'నారప్ప' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2019లో తమిళ స్టార్ ధనుష్ అవార్డు గెలుచుకున్న 'అసురన్' అనే తమిళ సినిమా రీమేకే ఈ నారప్ప సినిమా. వెంకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమా షూటింగ్ ( Narappa movie shooting ) బుధవారం నుండి ఎన్నో కఠినమైన భద్రతా చర్యల మధ్య తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో ఈ చిత్ర షూటింగ్ 80 శాతం ముగుస్తుంది అని తెలుస్తోంది. ఈ మూవీకి సంబందించిన చిన్న వీడియో బిట్‌ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also read : Bigg Boss 4 Telugu: అభిజీత్ గురించి వాళ్లమ్మ ఏం చెప్పిందంటే

తాజా అప్‌డేట్ ప్రకారం, వెంకీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నారప్ప సినిమా టీజర్‌ను ( Narappa movie teaser ) డిసెంబర్ 13న వెంకటేష్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. దీని గురించి త్వరలో ఈ చిత్ర నిర్మాతలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు అని తెలుస్తోంది.

శ్రీకాంత్ అడ్డాల ( Srikanth Addala ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తమిళంలో మంజు వారియర్ పోషించిన పాత్రను తెలుగులో ప్రియమణి ( Actress Priyamani ) నటిస్తోంది. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ ( ManiSharma ) చేస్తున్నారు. Also read : Mahesh Babu for Uppena: మెగా హీరో చిత్రానికి మహేష్ బాబు ప్రమోషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News