Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కు అవమానం.. అలాంటి పనుల కోసమే వచ్చావా అంటూ నాగబాబు ఫైర్?

Nagababu Counter to Sudigali Sudheer: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న కొన్ని కార్యక్రమాలలో కనపడుతున్న సుడిగాలి సుధీర్ కు అవమానకర పరిస్థితి ఎదురైంది. పైకి నవ్వుతూనే ఉన్నా ఆయన షాక్ కి గురైన సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2022, 06:43 PM IST
  • సుడిగాలి సుధీర్ కు అవమానం
  • కౌంటర్ వేసిన నాగబాబు
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కు అవమానం.. అలాంటి పనుల కోసమే వచ్చావా అంటూ నాగబాబు ఫైర్?

Nagababu Counter to Sudigali Sudheer: తెలుగు టెలివిజన్లో జబర్దస్త్ షో పాపులర్ అయినంత బాగా మరే షో పాపులర్ అవ్వలేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎప్పుడో సుమారు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. షోకి కంటెస్టెంట్లు,  జడ్జీలు మారుతున్నా సరే షో మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది. ఇప్పుడు కాస్త టీఆర్పీ రేటింగులు తగ్గాయి కానీ ఒకప్పుడు భారీ రేటింగ్స్ తో షో ముందంజలో ఉండేది. అయితే పలు కారణాలతో ఈ షో ద్వారా లైఫ్ నిలబెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ షోకి దూరమవుతున్నారు. నాగబాబు మల్లెమాల యాజమాన్యంతో వచ్చిన గొడవల నేపథ్యంలో తప్పుకున్నారు.

ఆయన వెళ్లి స్టార్ మాలో సెటిల్ అవడమే కాక చాలామంది జబర్దస్త్ కమెడియన్లను అత్యధిక రెమ్యూనరేషన్లు ఆశ చూపించి పలు ఇతర ఆఫర్లు చూపించి తన వైపు తిప్పుకున్నారు. మరోపక్క రోజా కూడా మంత్రి కావడంతో షో నుంచి తప్పుకున్నారు అయితే ఈ మధ్యనే జబర్దస్త్ నుంచి తప్పుకుని స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న కొన్ని కార్యక్రమాలలో కనపడుతున్న సుడిగాలి సుధీర్ కు అవమానకర పరిస్థితి ఎదురైంది. పైకి నవ్వుతూనే ఉన్నా ఆయన ఒక్క క్షణం పాటు షాక్ కి గురైన సంఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

అసలు విషయం ఏమిటంటే ఈటీవీలో ఎలా అయితే పండుగలకు,  ఆదివారాలకు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తారో స్టార్ మా వాళ్ళు కూడా అదే ఫార్మాట్ కాపీ కొట్టి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి దాదాపుగా తమకు అందుబాటులో ఉన్న అందరినీ పిలిపిస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ లేదా పుష్ప అనే ఒక స్పెషల్ ఈవెంట్ ఈ ఆదివారం కోసం ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్,  నాగబాబుకు వెల్కమ్ చెప్పడంతో దానికి నాగబాబు కాస్త షాకింగ్ రీతిలో స్పందించారు. ఎవరు ఎవరికి వెల్కం చెబుతున్నారు? అంటూ ఆయన ప్రశ్నించడంతో సుధీర్ ఒక్క క్షణం పాటు షాకయిన పరిస్థితి కనిపించింది. 

అంటే ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన నాకు నిన్న కాక మొన్న వచ్చిన నువ్వు వెల్కమ్ చెప్పడం ఏంటి అనే ఉద్దేశంతో ఆయన ప్రశ్నించారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. సుధీర్ వ్యక్తిగతంగా ఎలాంటి వాడినే విషయం పక్కన పెడితే తనను తాను ఒక అమ్మాయిలు పిచ్చోడనే ముద్ర వేయించుకుని దాని ద్వారా కామెడీ పండించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రోగ్రాంలో కూడా అదే విధంగా తన మీద ఒక పంచ్  వేసుకుని నవ్వించే ప్రయత్నం చేయగా దానికి కూడా నాగబాబు అవమానకర రీతిలో స్పందించారు. 

ఈ పనులు చేయడం కోసమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా అంటూ ప్రశ్నించడంతో సుడిగాలి సుదీర్ పైకి నవ్వుతూనే కనిపిస్తున్నా ఆయన ఆవేదన తమకు అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా అభిమానుల వర్షన్ కాగా సుడిగాలి సుధీర్ నాగబాబును డాడీ అని సంబోధిస్తారు. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్య సంబంధం ఉందని జబర్దస్త్ కమెడియన్లు కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. కాబట్టి ఇదంతా ప్రోమో కోసమే,  ఇందులో పెద్దగా టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదనే చెప్పాలి.

Also Read: Actor Vk Naresh: మాది 'పవిత్ర' బంధం..ఆమెకు డ్రైవర్ తో అఫైర్.. వివాదాల నేపధ్యంలో ఓపెనయిన నరేష్

Also Read: Pushpa The Rule Auditions: 'పుష్ప'లో అల్లు అర్జున్ పక్కన నటించాలని ఉందా? .. ఇలా చేయండి చాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News