Most eligible bachelor teaser update: మ్యారేజ్ లైఫా.. అయ్యోయ్యోయ్యో అంటున్న అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అఖిల్‌కి ( Akhil Akkineni ) ఇండస్ట్రీలో సరిగా హిట్లు లేకపోవడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున కూడా కొడుక్కి హిట్ అందించడం కోసం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించాడు అని టాక్. 

Last Updated : Oct 19, 2020, 05:52 PM IST
Most eligible bachelor teaser update: మ్యారేజ్ లైఫా.. అయ్యోయ్యోయ్యో అంటున్న అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ( Most eligible bachelor ) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు అఖిల్‌కి ( Akhil Akkineni ) ఇండస్ట్రీలో సరిగా హిట్లు లేకపోవడంతో ఎలాగైనా సరే ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవాలని అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. నాగార్జున కూడా కొడుక్కి హిట్ అందించడం కోసం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించాడు అని టాక్. లాక్‌డౌన్ కారణంగా చివరి దశలో షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల తిరిగి ఈ చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించింది. Also read : Bigg Boss Telugu 4: కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడా..! పంపించేశారా?

ఈ రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి సంబంధించి ఈ సినిమా యూనిట్ ప్రీ టీజర్ వీడియోను ( Most eligible bachelor pre-teaser )  విడుదల చేసింది. ప్రీ టీజర్‌‌లో ముందుగా ఈ సినిమాలో అఖిల్ పేరు 'హర్ష' అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారేజ్ లైఫ్ ( Marriage life ) ఉంటుంది. కెరీర్‌ను సూపర్‌గా సెట్ చేశా, ఇక మ్యారీడ్ లైఫే... అయ్యయ్యయ్యో..’ అని చెబుతూ పరోక్షంగా మ్యారీడ్ లైఫ్‌ని ( Married life ) బ్యాలెన్స్ చేయడం కష్టమనే సంకేతాలిస్తూ ఊగిపోవడాన్ని ఈ ప్రీ టీజర్ వీడియోలో చూడొచ్చు. ఈ దసరా పండుగ ( Dussehra festival ) సందర్భంగా అక్టోబర్ 25న ఉదయం గం. 11.40 లకు ఈ సినిమా టీజర్‌ను ( Most eligible bachelor teaser ) విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో పేర్కొన్నారు. Also read : Rashmika Mandanna: రష్మికకు కోటి మంది ఫాలోవర్స్

టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన లక్కీ మస్కట్‌గా మారిన పూజా హెగ్డే ( Actress Pooja Hegde ) ఈ సినిమాలో అఖిల్ సరసన జంటగా నటిస్తోంది. కనీసం ఈ లక్కీ హీరోయిన్‌తోనైనా అఖిల్‌కి లక్ కలిసి వస్తుందేమో చూడాలి మరి. బన్నీ వాస్, వాసు వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజంట్ చేస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. Also read : Vakeel Saab shooting: వకీల్ సాబ్ షూటింగ్‌కి పవన్ కల్యాణ్ రెడీ

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x