Chiranjeevi Emotional: మీ అందరి అకుంటిత కృషే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం..చిరు ఎమోషనల్!

Megastar Emotional on Waltair Veerayya: ల్తేరు వీరయ్య  సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 14, 2023, 09:38 PM IST
Chiranjeevi Emotional: మీ అందరి అకుంటిత కృషే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం..చిరు ఎమోషనల్!

Megastar Emotional on Waltair Veerayya Success: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య  సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి,  రవితేజ కలిసి ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ సక్సెస్ మీట్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వీడియో షేర్ చేయగా అందులో సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా పంచుకున్నారు.

ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు నా నమస్కారాలు,  మా గమ్యం మిమ్మల్ని అల్లరించడం ఎండ మండుతున్న వాన కురుస్తున్న చలి వణికిస్తున్న మంచు ముంచేస్తున్నా ముందుకు అడుగేయడమే మాకు తెలుసు. కొండల్ని ఎక్కుతం లోయల్ని దాటుతం వాగుల్లో నడుస్తాం అడవుల్లో సేద తీరుతాము,  ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం,  మా గమ్యం మిమ్మల్ని అలరించడం. మేము చేయలేనిది ఏదీ లేదు అసాధ్యాలను సుసాధ్యం చేస్తాం,  ఆకాశానికి నిచ్చెనలు వేయగలం,  సముద్రానికి వారదులు కట్టగలం,  ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం.

మా గమ్యం మిమ్మల్ని అలరించడం. నెలలు తరబడి కుటుంబానికి దూరంగా ఉంటాం,  కట్టుకున్న వాళ్లు గుర్తు వచ్చి దిగులు అనిపించినా,  కన్న బిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కినా పైకి కనపడకుండా నిబ్బరంగా నటిస్తాం,  శ్రమిస్తాం ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం,   మా గమ్యం ఒక్కటే మిమ్మల్ని అందరిని అలరించడం.

మేమంతా సినీ కార్మికులం నిరంతర శ్రామికులం,  కథకి బానిసలం కళామాతల్లి సైనికులం,  మేమంతా సినిమా ప్రేమికులం సినిమా అనే మా కులం మా గమ్యం మిమ్మల్ని అలరించడం. ఇంతటి అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి ఒక్క సినీ కార్మికుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను,  మీ అందరి అకుంటిత కృషి,  వాల్తేరు వీరయ్య విజయానికి కారణం,  థాంక్యూ వన్ అండ్ ఆల్ అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ పేర్కొన్నారు. 
Also Read: Body chopped: ఢిల్లీలో 3 ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యం.. టెర్రరిస్టు లింకుల కలకలం!

Also Read: Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News