Ramarao On Duty Teaser: పేరు సింపుల్.. కానీ సూపర్ మ్యాన్.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్..

Ramarao On Duty Teaser: మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ విడుదలైంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, ఆకట్టుకునే విజువల్స్, బీజీఎంతో టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 05:16 PM IST
  • రామారావు ఆన్ డ్యూటీ టీజర్ విడుదల
  • ఆకట్టుకునే విజువల్స్, డైలాగ్స్‌, బీజీఎం
  • ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
Ramarao On Duty Teaser: పేరు సింపుల్.. కానీ సూపర్ మ్యాన్.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్..

Ramarao On Duty Teaser: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ విడుదలైంది. మహా శివరాత్రి శుభాకాంక్షలతో మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసింది. 'పేరు సింపుల్‌గా ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్..',  'ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంపై ఉంటుంది. ఆయుధంలా బతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది.' వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. నిజాయితీ, నిబద్దత కలిగిన అధికారిగా, పేదల పక్షాన నిలిచే అధికారిగా రవితేజ కనిపించనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత నటుడు తొట్టెంపూడి వేణు రామారావు ఆన్ డ్యూటీ టీజర్‌లో కనిపించాడు. సినిమాలో నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు 3 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

టీజర్‌లో రవితేజ ఎనర్జీ చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నటుడు తొట్టెంపూడి వేణు మళ్లీ తెరపై కనిపించబోతుండటం సంతోషంగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ నెల 25నే రామారావు ఆన్ డ్యూటీ విడుదల కావాల్సి ఉండగా.. అదే రోజు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో రవితేజ మూవీ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Also Read: Lucky Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఇకపై వారి పట్టిందల్లా బంగారమే!

Also Read: Panch Grahi Yog 2022: పంచ గ్రహ కూటమి ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News