భరత్ అనే నేను దర్శకుడిపై తనదైన స్టైల్లో అభిమానాన్ని చాటుకున్న మహేష్ బాబు, కియారా

దర్శకుడు కొరటాల శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన 'భరత్ అనే నేను' జంట 

Last Updated : Jun 15, 2018, 06:20 PM IST
భరత్ అనే నేను దర్శకుడిపై తనదైన స్టైల్లో అభిమానాన్ని చాటుకున్న మహేష్ బాబు, కియారా

టాలీవుడ్ టాప్ డైరెక్టర్, తనకు నాలుగేళ్లలో రెండు హిట్స్ అందించిన దర్శకుడు కొరటాల శివకు తనదైన స్టైల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి అతడిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనకు ప్రియమైన మిత్రుడు, అద్భుతమైన దర్శకుడు కొరటాల శివ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితాంతం సంతోషంగా ఉండాలని, అపజయం లేకుండా విజయపరంపర కొనసాగించాలని కోరుకుంటున్నట్టుగా మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా అతడిపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని ఆ ట్వీట్‌లో పేర్కొని మహేష్ బాబు తన సింప్లిసిటీని మరింత చాటుకున్నాడు.

 

మహేష్ బాబుతోపాటు భరత్ అనే నేను సినిమాలో అతడి సరసన జంటగా నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వాని సైతం కొరటాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఎంతో మర్యాదస్తుడు, తన మొదటి తెలుగు సినిమా దర్శకుడు కొరటాల శివ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ కియారా అద్వాని ట్వీట్ చేసింది.

 

Trending News