Mahesh Babu Workouts : త్రివిక్రమ్ కోసమా? రాజమౌళి కోసమా?.. బీస్ట్ మోడ్‌లోకి మహేష్ బాబు.. పిక్స్ వైరల్

Mahesh Babu Workouts మహేష్‌ బాబు ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా కోసమో, త్రివిక్రమ్ సినిమా కోసమో తెలియడం లేదు గానీ ఇప్పుడు మహేష్‌ బాబు మాత్రం బాడీని పెంచేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మహేష్‌ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 11:41 AM IST
  • వర్కౌట్లతో మహేష్‌ బాబు బిజీ
  • త్రివిక్రమ్ సినిమా షూట్‌లో సూపర్ స్టార్
  • బాడీ పెంచేస్తోన్న సూపర్ స్టార్
Mahesh Babu Workouts : త్రివిక్రమ్ కోసమా? రాజమౌళి కోసమా?.. బీస్ట్ మోడ్‌లోకి మహేష్ బాబు.. పిక్స్ వైరల్

Mahesh Babu fitness మహేష్‌ బాబు ఎప్పుడూ ఎక్కువగా తెరపై తన బాడీని చూపించాలని, తెరపై చొక్కాలు చింపేసుకుని కనిపించాలని ఎప్పుడూ అనుకోడు. సుకుమార్ ఒత్తిడి వల్ల వన్ నేనొక్కడినే సినిమాలో ఓ షాట్‌లో కనిపిస్తాడు. కానీ ఎప్పుడూ కూడా షర్ట్ లెస్ సీన్లు  చేయలేదు. అలాంటి వాటికి మహేష్ బాబు నో చెబుతాడు. అయితే మహేష్‌ బాబు ఇప్పుడు తన బాడీని పెంచేస్తున్నాడు. అయితే అది త్రివిక్రమ్ సినిమా కోసమేనా? అన్నది తెలియడం లేదు. రాజమౌళి ఇప్పటి నుంచే తన హీరోను సంసిద్దం చేస్తున్నాడా? అన్నది తెలియడం లేదు.

మహేష్‌ బాబు గత ఏడాది సర్కారు వారి పాట అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. యావరేజ్‌ టాక్‌తో ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టేసింది. అయితే సర్కారు వారి పాట మీద ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది. కీర్తి సురేష్‌ పాత్ర, మహేష్‌ బాబు క్యారెక్టరైజేషన్ మీదా ట్రోలింగ్ జరిగింది.

అయితే మహేష్‌ బాబు చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాను ప్రారంభించాడు. ముందు అనుకున్న కథతో సెట్ మీదకు వెళ్లారు. యాక్షన్ పార్ట్‌ను ఓ షెడ్యూల్‌లో పూర్తి చేశారు. కానీ దాంతో మహేష్‌ బాబు సంతృప్తి చెందలేదు. అందుకే కథను పూర్తిగా మార్చమని, కొత్త స్క్రిప్ట్‌ రెడీ చేయమని మహేష్ బాబు కోరాడు. దీంతో తీసిన ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను పక్కన పెట్టేశారు.

 

కొత్తగా కథ రాసుకుని, పూర్తి స్క్రిప్ట్ నచ్చిన తరువాతే మహేష్‌ బాబు సెట్స్ మీదకు వచ్చాడు. అలా ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే మహేష్‌ బాబు ఇలా స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించాడు. బాడీ బాగానే పెంచేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ లుక్ ఏ సినిమా కోసమన్నది క్లారిటీగా తెలియడం లేదు.

మహేష్‌ బాబు షేర్ చేసిన ఈ ఫోటోలను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆన్ ఫైర్.. మంట పెట్టేస్తున్నావ్ అన్నట్టుగా ఫైర్ ఎమోజీలను నమ్రత షేర్ చేసింది. ఎవడ్రా హృతిక్ రోషన్ అంటూ నెటిజన్లు మహేష్‌ బాబు ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు.

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News