Kapatadhaari Trailer: సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న కపటధారి ట్రైలర్

సుమంత్ హీరోగా రాబోతున్న కపటధారి మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నాగ చైతన్య ఇవాళ లాంచ్ చేశాడు. కపటధారి ట్రైలర్ చూస్తే.. కథాంశం ఆద్యంతం అనేక ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో నిండిన మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుందని అర్థమవుతోంది.

Last Updated : Jan 12, 2021, 09:50 PM IST
Kapatadhaari Trailer: సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న కపటధారి ట్రైలర్

సుమంత్ హీరోగా రాబోతున్న కపటధారి మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నాగ చైతన్య ఇవాళ లాంచ్ చేశాడు. కపటధారి ట్రైలర్ చూస్తే.. కథాంశం ఆద్యంతం అనేక ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో నిండిన మిస్టరీ థ్రిల్లర్‌గా ఉంటుందని అర్థమవుతోంది. వృత్తిరీత్యా ట్రాఫిక్ పోలీస్ అయిన ఓ ఆఫీసర్.. పోలీసులు చేయని పనిని చేసి మర్డర్ మిస్టరీలను ఛేదిస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. 

విజయ్ ఆంటోనీ నటించిన సైతాన్ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి కపటధారి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కపటధారి మూవీలో సుమంత్‌తో పాటు నాజర్, నందితా శ్వేతా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథ్, సంపత్ వంటి నటీనటులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Also read : Zombie Reddy release date : జాంబి రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్

రిషి, అనంత్ నాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం కవలుదారీకి ( Kavaludhaari ) తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమానే ఈ కపటధారి మూవీ. సుమంత్ ( Sumanth ) కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు విషయానికొస్తే.. మలయాళ గ్యాంగ్ స్టర్-కామెడీ పడయోట్టం మూవీ తెలుగు రీమేక్‌లో ( Padayottam Telugu remake ) సుమంత్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. విను యజ్ఞ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News