ప్రేమికులను కదిలించే.. కన్నీరే లిరికల్ సాంగ్

మంచుకురిసే వేళలో: ఆకట్టుకునే లిరిక్స్‌తో.. కన్నీరే లిరికల్ సాంగ్

Last Updated : Dec 15, 2018, 11:45 AM IST
ప్రేమికులను కదిలించే.. కన్నీరే లిరికల్ సాంగ్

బాల బొడెపూడి అనే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో రామ్ కార్తిక్, ప్రణళి గొగరే, యశ్వంత్ అనే నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మంచుకురిసే వేళలో మూవీ నుంచి తాజాగా మేకర్స్ కన్నీరే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ప్రణతి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరిబాల సుబ్రహ్మణ్యం బొడెపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. భాస్కరభట్ల రచించిన కన్నీరే లిరికల్ సాంగ్‌లో "తనివితీరిపోని జ్ఞాపకాలు అన్నీ.. తడిమిచూసుకోనా తరచుగా.. కలిసి వున్న కాలం కొద్దిరోజులైనా.. గుర్తుపెట్టుకోనా జీవితం పొడుగునా.. నువ్విలా నన్ను వీడిపోవని.. నమ్మకం పెంచుకున్న ప్రేమ ఇది.. అందుకే కంటి ముందు లేవని భావనే నన్ను చేరనన్నది" వంటి పలు లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ కంపోజిషన్‌లో హరిని ఇవటూరి పాడిన కన్నీరే పాటపై మీరూ ఓ లుక్కేయండి.

Trending News