Hero Karthikeya With cheetah : చిన్నప్పటి 'చిరు' కల నెరవేరిందట.. చిరుతపులితో హీరో కార్తికేయ

Hero Karthikeya With cheetah హీరో కార్తికేయ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ చిరుతపులితో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 03:33 PM IST
Hero Karthikeya With cheetah : చిన్నప్పటి 'చిరు' కల నెరవేరిందట.. చిరుతపులితో హీరో కార్తికేయ

Hero Karthikeya With cheetah : హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ మళ్లీ మరో హిట్ కొట్టలేకపోయాడు. నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీశాడు. హీరోగా మాస్ సినిమాలను ట్రై చేశాడు. కానీ ఎందులోనూ సరైన ఫలితం రాలేదు. చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క ఇలా కొత్తగా చేసిన చిత్రాలు కూడా సక్సెస్ అవ్వలేదు. గత ఏడాది కార్తికేయ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

కార్తికేయ ఓ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను.. అభిమానిని అంటూ ఎన్నో స్టేజీల మీద చెప్పాడు. ఇక ఓ ఈవెంట్లో అయితే చిరంజీవి పాటలన్నంటికి మెడ్లీ స్టెప్పులు వేసి చిరంజీవిని కూడా మెప్పించాడు. అంతలా అభిమానాన్ని చూసి చిరంజీవి కూడా మురిసిపోయాడు. ఇక చిరంజీవి లంకేశ్వరుడు సినిమా చూసినప్పటి నుంచి కూడా కార్తికేయకు ఓ కోరిక ఉండేదట. తాను కూడా అలా చిరుతపులితో కలిసి నడవాలని, పెంచుకోవాలని అనుకున్నాడట.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kartikeya (@actorkartikeya)

అయితే తాజాగా కార్తికేయ ఇలా చిరుతపులితో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అడవి నాదే వేట నాదే.. చిరుత అంటూ డైలాగ్ చెప్పినట్టుగా పోస్ట్ వేశాడు. తన జీవితంలోని చెక్ లిస్ట్‌లోంచి కొన్ని అయిపోయాయ్ అంటూ.. బనియన్ వేసుకుని చిరుత మీద చేయి వేయాలి.. అనే తన కోరిక తీరిందట. ఎందుకంటే లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవి కూడా అలానే కనిపిస్తాడు.

అలా చిన్నప్పుడు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ కోరిక అలా మిగిలిపోయిందట. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరిందని అంటున్నాడు కార్తికేయ. మొత్తానికి ఈ లుక్స్, స్టిల్స్ మాత్రం నిజంగానే అదిరిపోయాయి. ఇక కార్తికేయ తన తదుపరి చిత్రాలతోనైనా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Sudigali Sudheer Remuneration : గాలోడు సినిమాతో దశ తిరిగిందిగా.. సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Also Read : Rishab Shetty - Rashmika Mandanna : రష్మికకి అంత పొగరా?.. తిక్క తీర్చిన రిషభ్ శెట్టి.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News