F2 movie sequel : F2కి సీక్వెల్‌గా F3.. ఆ మూడో హీరో ఎవరు ?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గతేడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మల్టీస్టారర్ F2 మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు కంటే ముందుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు.

Last Updated : Jan 25, 2020, 05:55 PM IST
F2 movie sequel : F2కి సీక్వెల్‌గా F3.. ఆ మూడో హీరో ఎవరు ?

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా గతేడాది సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మల్టీస్టారర్ F2 మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు కంటే ముందుగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ ఫిర్జాద జంటగా నటించారు. తోడల్లుళ్ల పాత్రలో వెంకీ, వరుణ్ తేజ్ పోషించిన పాత్రలు ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్వించాయి. సినిమా చూస్తున్నంతసేపూ ఆడియెన్స్ ఏదో ఓ పాత్రతో కనెక్ట్ అయిపోయేలా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన విధానం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఆడియెన్స్‌ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఈ సినిమాకు F3 సీక్వెల్ చేయడానికి అనిల్ రావిపూడి ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం.  

అయితే, F3 మూవీలో వెంకీ, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరో కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం.. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో మూడో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. సింగిల్‌గానే సింగిల్ మినిట్ గ్యాప్ లేకుండా నవ్వించే మాస్ మహారాజ ఈ ప్రాజెక్టులో పనిచేస్తే.. ముగ్గురు హీరోలు, హీరోయిన్స్ పండించే హాస్యం ఇంకే రేంజ్‌లో ఉంటుందోనని F2 ఫ్యాన్స్ అనుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News