ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఇండస్ట్రీలో మరో ఆందోళన

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2020, 10:50 AM IST
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఇండస్ట్రీలో మరో ఆందోళన

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. మీడియాలో వస్తున్న కథనాలపై రిషి కపూర్‌ సోదరుడు రణధీర్‌ కపూర్‌ స్పందించారు. తన సోదరుడికి ఆరోగ్యం బాగోలేదన్న వార్తలు నిజమేనన్నారు.  రెండేళ్ల కిందటే తన మరణంపై ఇర్ఫాన్ జోస్యం!

రణధీర్‌ కపూర్‌ పీటీఐతో మాట్లాడారు. ‘రిషికపూర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైద్యులు చికిత్స అందిస్తున్నారని’ రిషి కపూర్‌ సోదరుడు రణధీర్‌ వివరించారు. అయితే నటుడి ఆరోగ్యం కాస్త విషమంగా ఉందని, ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారని కథనాలు వైరల్‌ అవుతున్నాయి.   Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ

2018లో న్యూయార్క్‌కు వెళ్లి అక్కడే క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత 2019 సెప్టెంబర్‌లో భార్య నీతూ కపూర్‌తో కలిసి భారత్‌కు తిరిగొచ్చారు రిషి కపూర్‌. తన మనసులోని మాటల్ని సూటిగా, స్పష్టంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ విమర్శలకు సైతం గురవతుంటారు రిషి. అయితే కొంతకాలం నుంచి సోషల్‌ మీడియాలో ఆయన అంత యాక్టీవ్‌గా లేరు.  Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కన్నుమూసిన రోజే రిషి కపూర్‌ ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరడంతో బాలీవుడ్‌లో మరో ఆందోళన మొదలైంది. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతూ బుధవారం ఇర్ఫాన్ మరణించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News