Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామాలు.. శత్రువులుగా బిందు మాధవి, యాంకర్ శివ!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు సన్నిహితంగా మెలిగిన యాంకర్ శివ, బిందు మాధవి మధ్య తాజాగా వాగ్వాదం జరిగింది. అది కూడా నామినేషన్ల విషయంలో! వారిద్దరి వాగ్వాదానికి కారణం ఏంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 11:35 AM IST
Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామాలు.. శత్రువులుగా బిందు మాధవి, యాంకర్ శివ!

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గత ఐదేళ్లుగా తెలుగులో విజయవంతంగా కొనసాగడం వల్ల ఇప్పుడు ఆ షోను 24 గంటలు ఓటీటీలో ప్రసారం చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పుడా షో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ఇప్పటికే 8 వారాలు పూర్తి చేస్తున్న ఈ రియాలిటీ షో.. ఇప్పుడు సోమవారం (ఏప్రిల్ 25) 9 వారంలోకి అడుగుపెట్టింది. 

ఈ షో నుంచి ఇప్పటికే 8 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు 9వ వారం కోసం తాజాగా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఇప్పటి వరకు హౌస్ లో చాలా సన్నిహితంగా మెలిగిన బిందు మాధవి - యాంకర్ శివ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. 

9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా దిష్టిబొమ్మల తలలకు కుండలను పెట్టి.. నామినేట్ చేయాలనే వారి ఫొటో ఉన్న కుండలను బ్యాట్ తో కొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఎప్పటిలాగే పోటీదారులు తమ ఫస్ట్రేషన్ ను కుండలపై తీర్చుకున్నారు. అయితే ఇన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో సన్నిహితులుగా మెలిగిన బిందు మాధవి, యాంకర్ శివల టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. 

ఎందుకంటే యాంకర్ శివను బిందు మాధవి ఎలిమినేషన్ కు నామినేట్ చేయడమే అందుకు కారణంగా కనిపిస్తుంది. ఈ కారణంగా బిందు మాధవి, యాంకర్ శివ మధ్య వాగ్వాదం జరిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటి వరకు ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, RJ చైతు, సరయూ, తేజస్వి, స్రవంతి చొక్కారపు, మహేష్ విట్టా, అజయ్ కతుర్వార్ బయటకు (ఎలిమినేట్) వెళ్లారు.  

Also Read: KGF 2 Collection: బాలీవుడ్ లో 'కేజీఎఫ్ 2' హవా.. 'బాహుబలి 2' రికార్డులను కొల్లగొడుతోందా?

Also Read: Kajal Aggarwal in Acharya: 'ఆచార్య' మూవీ టీజర్, ట్రైలర్ లలో కాజల్ అగర్వాల్ లేదేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News