Bigg Boss Sreemukhi Photoshoot : ప్యాంట్ మరిచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలతో హీట్ పెంచేస్తోన్న శ్రీముఖి

Sreemukhi Latest Photoshoot బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్‌ను తెచ్చుకున్న శ్రీముఖి ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరినీ మెప్పిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 07:36 PM IST
  • నెట్టింట్లో శ్రీముఖి సందడి
  • డ్యాన్స్ ఐకాన్ కోసం మరింత పొట్టి బట్టలు
  • శ్రీముఖి లెటెస్ట్ ఫోటో షూట్ వైరల్
Bigg Boss Sreemukhi Photoshoot : ప్యాంట్ మరిచిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటోలతో హీట్ పెంచేస్తోన్న శ్రీముఖి

Bigg Boss Sreemukhi Photoshoot : బుల్లితెరపై శ్రీముఖి చేస్తోన్న సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై, వెండితెరపై, ఓటీటీ ఇలా అన్ని చోట్లా శ్రీముఖి సందడి చేస్తోంది. బుల్లితెరపై అన్ని చానెళ్లలో కనిపిస్తోంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లలో కనిపిస్తోంది. ఇవి కాకుండా  ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. ఇక సిల్వర్ స్క్రీన్ మీద సైతం శ్రీముఖి దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.

బుల్లితెరపై ఇప్పటికే జాతి రత్నాలు అని రచ్చ చేస్తోంది. ఈ మధ్యే మిస్టర్ అండ్ మిసెస్ అని కొత్త షోకు హోస్ట్‌గా మారింది. స్టార్ మాలో పండుగ ఈవెంట్లు, బిగ్ బాస్ ఈవెంట్లు అంటే శ్రీముఖి హోస్ట్ చేయాల్సిందే.  మొన్నటి వరకు జీ తెలుగు సరిగమప షోలో శ్రీముఖి పొట్టి బట్టలతో దుమ్ములేపేసింది.

శ్రీముఖి ఇప్పుడు ఆహా కోసం డ్యాన్స్ ఐకాన్ అనే షోను చేస్తోంది. ఇందులో శ్రీముఖి హోస్టింగ్, దాని కోసం స్పెషల్ డిజైనర్ దుస్తులను వేసుకోవడం, వాటి ఫోటో షూట్లు, పొట్టి బట్టలలో శ్రీముఖి కనిపించే తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. అసలే శ్రీముఖి ఈ మధ్య అందాల ప్రదర్శనలో హద్దులేమీ పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదు.

ప్రస్తుతం శ్రీముఖి చేతిలో పలు సినిమా ప్రాజెక్టులున్నాయి. అందులో మెహర్ రమేష్‌ చిరంజీవి కాంబోలో రాబోతోన్న భోళా శంకర్ సినిమా ఒకటి.ఈ చిత్రంలో శ్రీముఖికి మంచి రోల్ దక్కినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో శ్రీముఖి చిరంజీవి కాంబో సీన్స్ కూడా ఉంటాయనిపిస్తోంది.

శ్రీముఖికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. నెట్టింట్లో ఆమె అందాల ప్రదర్శన కాకుండా.. ఆమె చేసే రీల్ వీడియోలు, వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ మధ్య శ్రీముఖి విష్ణుప్రియ కలిసి వేసిన స్టెప్పులు, ఆ తరువాత శేఖర్ మాస్టర్‌తో కలిసి వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు శ్రీముఖి జీరో సైజ్‌లోకి వచ్చింది. ఈ మేరకు శ్రీముఖి జిమ్‌లో తెగ కష్టపడింది. శ్రీముఖి వర్కౌట్ల వీడియోలు సైతం నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మాత్రం డ్యాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి వేసిన పొట్టి బట్టలు చూసి.. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా? అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

Also Read : Hamida Khatoon New Benz Car : కొత్త కారు కొన్న హమీద.. దాని రేటు ఎంతంటే?

Also Read : Vishnu Manchu Wife : ఆపనికి ఇంట్లో ఒప్పుకోవడం లేదట!.. మంచు విష్ణు ట్వీట్.. నెటిజన్ల కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News