Bichagadu 2 4 Minutes: బిచ్చగాడు 2 సినిమాలో మొదటి 4 నిముషాలు రిలీజ్.. భలే ప్లానింగ్ గురూ!

Bichagadu 2 First 4 Minutes to Be Released: బిచ్చగాడు 2 సినిమా వేసవిలో రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్న క్రమంలో సరికొత్త ప్రమోషనల్ స్టంట్ తెర మీదకు తెచ్చారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 08:40 PM IST
Bichagadu 2 4 Minutes: బిచ్చగాడు 2 సినిమాలో మొదటి 4 నిముషాలు రిలీజ్.. భలే ప్లానింగ్ గురూ!

Bichagadu 2 First 4 Minutes: బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా సూపర్ పాపులారిటీ దక్కించుకున్నాడు విజయ్ ఆంటోని. తమిళ సినీ పరిశ్రమలో సింగర్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన విజయ్ ఆంటోని తర్వాత కాలంలో హీరోగా మారారు. డాక్టర్ సలీం, నకిలీ వంటి సినిమాలతో అక్కడ సైలెంట్ హిట్ కొట్టిన తర్వాత బిచ్చగాడు అనే సినిమాతో తెలుగులోకి కూడా ప్రవేశించారు. బిచ్చగాడు సినిమా దెబ్బకు ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. 2016లో తెరకెక్కించిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే ప్రకటించారు.

ఆ ప్రకటించిన దాని మేరకు గత ఏడాది షూటింగ్ ప్రారంభించారు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్లో భాగంగానే విజయ్ ఆంటోనీ గాయాల పాలయ్యాడు కూడా. ఆయన మొఖానికి కూడా చిన్నపాటి సర్జరీ కూడా జరిగింది, దీంతో ఎట్టకేలకు ఆయన కోలుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా విజయ్ ఆంటోని మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు, కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని విభిన్నంగా వినూత్నంగా ప్రమోట్ చేసే ఉద్దేశంలో భాగంగా సినిమాకు సంబంధించిన మొదటి నాలుగు నిమిషాలు రేపు స్నీక్ పీక్ గా విడుదల చేస్తున్నామని అధికారిక ప్రకటన చేశారు.

అంటే సినిమాలో వచ్చే మొదటి నాలుగు నిమిషాలను ఆన్లైన్ లో రిలీజ్ చేసి ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు కూడా స్టార్ గ్రూప్ భారీ రేటు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. దీంతో ఈ సినిమా మీద అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి.
Also Read: Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?

Also Read: Puri Jagannadh Movie: నక్క తోక తొక్కిన పూరీ జగన్నాధ్.. బాస్ తో సినిమా ఫిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News