Bichagadu 2: దుమ్ము రేపుతున్న బిచ్చగాడు.. పోన్నియన్ సెల్వన్ కలెక్షన్స్ బ్రేక్

Bichagadu 2 Crosses Ponniyin Selvan 2 Collections: విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన బిచ్చగాడు 2 రిలీజ్ అయింది.

Written by - Chaganti Bhargav | Last Updated : May 20, 2023, 08:01 PM IST
Bichagadu 2: దుమ్ము రేపుతున్న బిచ్చగాడు.. పోన్నియన్ సెల్వన్ కలెక్షన్స్ బ్రేక్

Bichagadu 2 Crosses Ponniyin Selvan 2 Telugu Collections: విజయ్ ఆంటోని హీరోగా నటించిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2016వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన బిచ్చగాడు 2 రిలీజ్ అయింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది.

అయితే బిచ్చగాడు మొదటి భాగం ప్రేక్షకులందరికీ బాగా నచ్చడంతో ఈ రెండో భాగం మీద కూడా ఆసక్తి చూపించారు. కానీ ఈ రెండవ భాగం ఆశించినంత మేర లేదని విమర్శకులు పెదవి విరిచారు. అయితే రివ్యూలతో సంబంధం లేకుండా ఈ రెండో భాగానికి వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో తమిళ సినిమా ప్రైడ్ అంటూ ప్రచారం చేసుకున్న పొన్నియన్ సెల్వన్ 2 సినిమా వసూళ్ల కంటే ఈ బిచ్చగాడు 2కి వచ్చిన తెలుగు వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Rashmika Vijay: దేవరకొండతో డేటింగ్ రూమర్స్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. అంతా సిగ్గే?

రెండు తెలుగు రాష్ట్రాలలో బిచ్చగాడు రెండో భాగం దాదాపు రెండున్నర కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఒక రకంగా చూసుకుంటే పొన్నియన్ సెల్వన్ 2 కంటే ఈ బిచ్చగాడు 2 కోటి రూపాయలు ఎక్కువ వసూలు చేసింది. రివ్యూలు సినిమా బాలేదని చెప్పినా ప్రేక్షకులు మాత్రం సినిమా చూసేందుకే ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ ద్విపాత్రయం చేసి నటించడమే కాదు సినిమాకి డైరెక్టర్గా కూడా వ్యవహరించాడు.

ఈ కథ ఆయనే రాసుకోగా ఎడిటింగ్ కూడా ఆయనే చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. కావ్య థాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో దేవ్ గిల్, జాన్ విజయ్, హరీష్ పెరడి, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.  ఇక ఈ సినిమాకి విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఆంటోనీ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఇక ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయని తెలుసుకున్న ఆమె సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం చావో రేవో అన్నట్లుగా రంగంలోకి దిగామని కానీ ప్రేక్షకులు తమను గెలిపించారని ఆమె ఎమోషనల్ అవుతున్నారు.

Also Read: Bichagadu 2 Review: విజయ్ అంటోనీ బిచ్చగాడు 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News