Bandla Ganesh Counter to Tollywood Producers: ఒకపక్క థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని గత కొద్ది రోజులుగా సినీ నిర్మాతలు షూటింగ్స్ నిలిపి వేసి ఆ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ విషయం మీద బండ్ల గణేష్ ఒక ఆసక్తికరమైన వీడియో విడుదల చేసి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ఈరోజు ఉదయం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక వీడియో విడుదల చేసిన ఆయన సినిమా, సినిమా.. నా జీవితం సినిమా, నాకు ఇష్టమైన పదం సినిమా. నేను సినిమా కోసమే బతుకుతున్న అంటూ చెప్పుకొచ్చారు.
ఈమధ్య సినిమాలు ఆడటం లేదు అంటూ జనాలు థియేటర్లకి రావడం లేదని చాలామందికి గగ్గోలు పెడుతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి వేరే భాష హీరో ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు అని దుల్కర్ సల్మాన్ గురించి, మన హీరోలలో మీడియం రేంజ్ హీరో కళ్యాణ్ రామ్, చిన్న హీరో నిఖిల్ తీసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మంచి కధ-కథనంతో మంచి కథలతో అద్భుతంగా సినిమాలు తెరకెక్కిస్తే ఎప్పుడైనా ఎలాంటి సమయంలో అయినా తెలుగు సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారు, ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.
మనమే సినిమాల బడ్జెట్లు పెంచుకుని వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీసి, కార్లు గాల్లోకి ఎగరేసి, హీరో చేతిలో ఓ రాడ్ పెట్టి వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని పైకిలేపితే జనాలు థియేటర్లకు వస్తారు అనుకోవడం తప్పని చెప్పుకొచ్చారు. గుండెకు హత్తుకునే, జనాల్ని థియేటర్లలో కూర్చోబెట్టే సినిమాలు తీయనంత కాలం మనకు ఇబ్బంది తప్పదని ఆయన కమెంట్ చేశారు.
ఈ సినిమా షూటింగ్స్ బందులు, థియేటర్ల టికెట్ రేట్లు తగ్గించుకోవడం వంటివి కాకుండా మంచి సినిమాలు తీయడం మీద దృష్టి పెడదామని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అలా గనక మంచి సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అంటూ బండ్ల గణేష్ వీడియోలో పేర్కొన్నారు. ఇక అలా చెబుతూనే తన ఇంట్లో ఫర్నిచర్ ని కూడా చూపించడంతో కొంత మంది అభిమానులు అవి చూపించడం కోసమే వీడియో చేశారా అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.
Also Read: Vijay Devarakonda: డేటింగ్ లో ఉన్నా కానీ ఆమె గురించి చెప్పను.. షాకిచ్చిన విజయ్ దేవరకొండ
Also Read: Akshay Kumar: ఆ దెబ్బతోనే కెనడా పౌరసత్వం.. దేశం వదిలి పోవాలనుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన అక్షయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
కార్లు పైకిలేస్తే థియేటర్లకు జనాలు వస్తారా.. ఇలా చేస్తేనే మనుగడన్న బండ్ల